రష్మీకి సొంత ఊరిలో 100 ఎకరాల పొలం? జబర్దస్త్ యాంకర్ కోట్లు కూడబెట్టిందా? మైండ్ బ్లోయింగ్ డిటైల్స్!

First Published | Aug 19, 2024, 12:07 PM IST

యాంకర్ రష్మీ గౌతమ్ కి సొంత ఊరు ఒరిస్సాలో వంద ఎకరాల పొలం ఉందట. ఆమె జబర్దస్త్ యాంకర్ గా కోట్లు కూడబెట్టిందట. ఈ వార్తలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది. 
 

హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన రష్మీ గౌతమ్ బిగినింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. చిన్నా చితకా చిత్రాల్లో లీడ్ రోల్స్ లో కనిపించింది. బ్రేక్ రాకపోవడంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. తెలుగు పెద్దగా రాకున్నా ఆమె బుల్లితెరపై సక్సెస్ అయ్యారు. అందుకు కారణం...  గ్లామరస్ యాంకర్ అనే ట్యాగ్ ఆమెకు కలిసొచ్చింది. 
 


ఈటీవీలో సందడి మొత్తం రష్మీదే. జబర్దస్త్ యాంకర్ గా ఆమె సంచలనాలు నమోదు చేసింది. ఆ ఫేమ్ తో ఢీ షోలో ఛాన్స్ రాబట్టింది. ఢీ వేదికగా రష్మీ-సుడిగాలి సుధీర్ ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచారు. వీరి కెమిస్ట్రీ అద్భుతం చేసింది. స్కిట్స్, రొమాంటిక్ సాంగ్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ రాబట్టారు. 



రష్మీ-సుధీర్ లు రెండు సార్లు బుల్లితెర వేదికగా ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు. అయితే తమ లవ్ అండ్ రొమాన్స్ ఆన్ స్క్రీన్ వరకే పరిమితం అంటారు ఈ జంట. ఆఫ్ స్క్రీన్ లో తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని పలు సందర్భాల్లో వివరణ ఇచ్చారు. రష్మీ-సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ అనే నమ్మే అభిమానులు చాలా మంది ఉన్నారు. 

Rashmi Gautam


దశాబ్ద కాలంగా బుల్లితెరపై రష్మీ రాణిస్తుంది. మరోవైపు నటిగా అడపాదడపా చిత్రాలు చేస్తుంది. ఒక దశలో హీరోయిన్ గా వరుస చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో రష్మీ బాగానే సంపాదించింది అట. రష్మీ గౌతమ్ సొంత ఊరు ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అక్కడ ఆమెకు 100 ఎకరాల భూమి ఉందట. ఈ మేరకు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో రష్మీ స్పందించింది. 

Rashmi Gautam

ఓ చిట్ చాట్ ప్రోగ్రాం లో పాల్గొన్న రష్మీని మీకు సొంతూరిలో వంద ఎకరాల పొలం ఉందట కదా? అని అడగ్గా... మా అమ్మ వాళ్ల బంధువుల తరపున సొంత ఊరిలో నాకు పొలం ఉన్నమాట వాస్తవమే. కానీ వంద ఎకరాలు అయితే లేదు. ఇలాంటి ప్రచారం చేసి నా మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడి చేసేలా చేయవద్దని, ఆమె ఫన్నీగా అన్నారు 

photo credit- rashmi Instagram


రష్మీకి ఓ నిర్మాత లగ్జరీ విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడంటూ గతంలో ప్రచారం జరిగింది. ఓ యూట్యూబ్ ఛానల్ కథనాలపై రష్మీ ఒకింత ఆవేదన వ్యక్తం చేసింది. నాకు మంచి ఇల్లు ఉంది. కారు ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉంది. నా దగ్గర ఉన్నదంతా కష్టార్జితంతో  సంపాదించుకున్నది. నాకు ఎవరూ బహుమతిగా ఇవ్వలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. రష్మీ గౌతమ్ ఆర్థికంగా సెటిల్. 36 ఏళ్ల రష్మీ ఇంకా వివాహం చేసుకోలేదు. అందుకు ఇంకా సమయం ఉందని అంటుంది.. 

Latest Videos

click me!