తేజస్విని గీతం గ్రూప్ చైర్మన్ భరత్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తండ్రి మీద మమకారంతో తేజస్విని ఆయన సినిమాల వ్యవహారాలు చూసుకునేందుకు ఇష్టపడిందట. గతంలో బాలయ్య సినిమాలకి సంబందించి ఫైనాన్సియల్ వ్యవహారాలు ఆయన సతీమణి వసుంధర చూసుకునేవారని టాక్. ఇప్పుడు బాలయ్య కాస్ట్యూమ్స్, కాల్ షీట్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇలా అన్ని వ్యవహారాల్ని తేజస్విని చూసుకుంటోందని ఇండస్ట్రీలో టాక్.