Sitara Ghattamaneni : మహేశ్ బాబు కూతురు సితార నెక్ట్స్ స్టెప్ ఏంటో తెలుసా? దేని కోసం సిద్ధం అవుతోందంటే..!

First Published | Jul 7, 2023, 11:14 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)  కూతురు సితార ఘట్టమనేని రీసెంట్ గా ఇంటర్నేషనల్ జ్యూవెల్లరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా మారిన విషయం తెలిసిందే. ఇక నెక్ట్స్ స్టెప్ పైనా కీలక నిర్ణయం తీసుకుంటున్న తెలుస్తోంది. 
 

స్టార్ కిడ్ సితారా ఘట్టమనేని (Sitara Ghattamaneni)  రీసెంట్ గా ఇంటర్నేషనల్ బ్రాండ్ కు అంబాసిడర్ గా మారిన విషయం తెలిసిందే. చిన్న వయస్సులోనే మహేశ్ బాబు కూతురు రేర్ ఫీట్ సాధించడంతో అభిమానులు, నెటిజన్లు అభినందనల వర్షం కురిపించారు. 
 

అమెరికాకు చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ పీఎంజే జ్యూవెల్లరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపికైంది. దానికి సంబంధించిన ఫొటోషూట్ కూడా చేసింది. రెండ్రోజుల కింద న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార హోర్డింగ్స్  కూడా మెరిసిన విషయం తెలిసిందే. 
 


ఒక్క యాడ్ షూట్ కే సితారా చిన్న హీరోయిన్లు తీసుకునే రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. కోటీ వరకు పారితోషికం తీసుకుందని ప్రచారం. ఇదిలా ఉంటే.. సితార నెక్ట్స్ స్టెప్ అంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలో సితార అందరికీ ఊహించని విధంగా షాక్ ఇవ్వబోతోందని తెలుస్తోంది. 
 

తాజా సమాచారం ప్రకారం.. సితార ‘మిస్ యూనివర్స్’, ‘మిస్ వరల్డ్’ పోటీలకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. తల్లి నమ్రతా శిరోద్కర్ సూచనలతోనే సితార ఈ పోటీలకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి ఇంకాస్తా సమయం పడుతుందని, పోటీల్లో పాల్గొనేందుకు కావాల్సిన అర్హతలు సితార సాధించాల్సి  ఉందని అంటున్నారు. 
 

ఇదే నిజమైతే సితార నటిగా పరిచయం కావడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికే నమత్రా సితారకు డాన్స్, యాక్టింగ్ సిల్స్ లో శిక్షణ ఇప్పించారని తెలుస్తోంది. మరోవైపు సితార కూడా తన డాన్స్ రీల్స్ తో, క్యూట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. 

సితార తొలిసారిగా మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’లోని పెన్నీ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. తన డాన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం స్కూలింగ్ పూర్తి చేసే పనిలో ఉంది. ఆ తర్వాత సితార తండ్రినే మించిపోయేలా మూవ్ కానుందని అంటున్నారు. 
 

Latest Videos

click me!