చిరంజీవి కంటే రజనీకాంత్ కొన్నేళ్ల ముందు ఇండస్ట్రీకి వచ్చారు. మద్రాసు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చిరు శిక్షణ పొందుతున్నప్పడు అక్కడే రజనీ సీనియర్ గా ఉన్నారు. కెరీర్ ఆరంభంలో రజని, చిరు పలు చిత్రాల్లో నటించారు. అంతే కాదు ఒకే సందర్భంలో కొన్ని రోజుల వ్యవధిలో వీరిద్దరూ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఆ విధంగా నాలుగుసార్లు చిరు, రజనీ నటించిన చిత్రాలు పోటీ పడ్డాయి. ఇప్పుడు జైలర్, భోళా శంకర్ చిత్రాలతో ఐదవసారి రజనీకాంత్, చిరు మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతోంది. ఆగష్టు 10న జైలర్ రిలీజ్ అవుతుండగా.. ఆగష్టు 11న భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.