ఎన్టీఆర్, కృష్ణ మధ్య దూరం ఎందుకు పెరిగింది.. విభేదాలకు కారణాలు ఏంటి ?

Published : May 31, 2022, 01:45 PM IST

సాహసాలకు మారు పేరుగా నిలిచి, తెలుగు సినిమా గతిని మార్చారు సూపర్ స్టార్ కృష్ణ. నటశేఖరుడిగా పేరుగాంచిన కృష్ణ నేడు కుటుంబ సభ్యులతో తన 79వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.

PREV
16
ఎన్టీఆర్, కృష్ణ మధ్య దూరం ఎందుకు పెరిగింది.. విభేదాలకు కారణాలు ఏంటి ?

సాహసాలకు మారు పేరుగా నిలిచి, తెలుగు సినిమా గతిని మార్చారు సూపర్ స్టార్ కృష్ణ. నటశేఖరుడిగా పేరుగాంచిన కృష్ణ నేడు కుటుంబ సభ్యులతో తన 79వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కృష్ణకి అభిమానులు , సెలెబ్రిటీలు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. 

26

కృష్ణ కెరీర్ లో వందలాది సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. కానీ ఆయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. చరిత్ర తిరగరాసిన చిత్రం అది. ఈ చిత్రం విషయంలో అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం ఉంది. తన కెరీర్ లోనే గొప్ప చిత్రం అల్లూరి సీతారామరాజు అని కృష్ణ చాలా సందర్భాల్లో తెలిపారు. 

36

ఓ సందర్భంలో కృష్ణ ఈ మూవీ గురించి మాట్లాడుతూ..  తాను నటుడు కాకముందు నుంచి అల్లూరి గురించి బుర్రకథలు రూపంలో అనేక విషయాలు వింటూ వచ్చాను. ఒకరోజు ఎన్టీఆర్ తదుపరి చిత్రం అల్లూరి సీతారామరాజు అని చదివాను.అప్పటి నుంచి ఎన్టీఆర్ ఎప్పుడు ఈ చిత్రం తీస్తారా అని ఎదురుచూశా. కానీ ఎంతకీ ఆ చిత్రం ప్రారంభం కాలేదు. 

46

దీనితో నా 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు ఎంచుకుని నేనే నిర్మించా. ఆ చిత్రం ఎంతటి విజయం సాధించిందో మీ అందరికి తెలిసిందే అని కృష్ణ అన్నారు.  నేను 365 సినిమాల్లో నటించినప్పటికీ నా ఉత్తమ చిత్రం ఎప్పటికి అల్లూరి సీతారామరాజే అని కృష్ణ తెలిపారు.

56

తాను నటించాలనుకున్న మూవీలో కృష్ణ నటించడంతో ఎన్టీఆర్ మనస్థాపానికి గురయ్యారని.. అప్పటి నుంచి కృష్ణ, ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగింది అని అంటుంటారు. అప్పట్లో కృష్ణ సూపర్ ఫామ్ లో ఉన్నారు. యువకుడు కావడంతో క్రేజ్ బాగా పెరిగింది. అదే సమయంలో ఎన్టీఆర్ బడి పండితులు లాంటి సాఫ్ట్ రోల్ చేశారు. దీనితో కృష్ణ పాపులారిటీ బాగా పెరిగింది. 

66

ఆ తర్వాత కాలంలో కూడా వీరి మధ్య అంతకంతకూ దూరం పెరుగుతూనే వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ కొన్ని చిత్రాలు చేశారనే ప్రచారం ఉంది. ఎన్ని మనస్పర్థలు ఉన్నా కృష్ణ ఇప్పటికి ఎన్టీఆర్ ని కొనియాడుతూ ఉంటారు. 

click me!

Recommended Stories