Bigg Boss 6: కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా.. హీటు పుట్టించే సెలెబ్రిటీలు.. హాట్ యాంకర్, యంగ్ హీరో రంగంలోకి..

Published : May 31, 2022, 12:29 PM IST

బిగ్ బాస్ నాన్ స్టాప్ ముగిసిందో లేదో.. బిగ్ బాస్ 6కి రంగం సిద్ధం అయింది. సామాన్యులకి అవకాశం అంటూ ప్రకటన కూడా ఇచ్చేశారు.

PREV
18
Bigg Boss 6: కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా.. హీటు పుట్టించే సెలెబ్రిటీలు.. హాట్ యాంకర్, యంగ్ హీరో రంగంలోకి..

బిగ్ బాస్ నాన్ స్టాప్ ముగిసిందో లేదో.. బిగ్ బాస్ 6కి రంగం సిద్ధం అయింది. సామాన్యులకి అవకాశం అంటూ ప్రకటన కూడా ఇచ్చేశారు. సీజన్ సిక్స్ కి కూడా హోస్ట్ లో ఎలాంటి మార్పు లేదు. కింగ్ నాగార్జున రెట్టించిన ఉత్సాహంతో రెడీ అవుతున్నారు. 

28

ఈ తరుణంలో బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ కి సంబంధించిన లీకులు, ఊహాగానాలు షురూ అయ్యాయి. సీజన్ 6లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరి సెలెబ్రిటీల పేర్లు వైరల్ గా మారాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియదు కానీ వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ క్రేజీగా ఉంది. 

38

లక్స్ పాప అంటూ నరసింహనాయుడు చిత్రంలో ఒక ఊపు ఉన్నా గ్లామర్ బాంబ్ ఫ్లోరా షైనీ పేరు బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ప్రధానంగా వినిపిస్తోంది. ఫ్లోరా షైనీ నువ్వు నాకు నచ్చావ్, ప్రేమతో రా లాంటి చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో బికినీల్లో ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాని వేడెక్కిస్తోంది. 

48

చైల్డ్ ఆర్టిస్ట్ గా నవ్వులు పూయించిన మాస్టర్ భరత్ కూడా బిగ్ బాస్ 6లోకి ఎంటర్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకీ, రెడీ లాంటి చిత్రాల్లో అలరించిన భరత్ ఇప్పుడు 27 ఏళ్ల యువకుడు. 

58

టాలీవుడ్ లో యాంకర్ గా రాణిస్తూనే తిరుగులేని గ్లామర్ తో కుర్రాళ్లని అట్రాక్ట్ చేసే మంజూష పేరు కూడా వినిపిస్తోంది. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ కి ఏమాత్రం తగ్గని అందం ఆమె సొంతం. మంజూష సీజన్ 6లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. 

68

యువ హీరో సుమంత్ అశ్విన్ కి కూడా బిగ్ బాస్ 6లో కంటెస్టెంట్ గా అవకాశం లభించినట్లు టాక్. సుమంత్ అశ్విన్ లవర్స్, హ్యాపీ వెడ్డింగ్ లాంటి చిత్రాలతో యువతకు చేరువయ్యాడు. సాఫ్ట్ నేచర్ ఉన్న అశ్విన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయితే ఎలా రాణిస్తాడో చూడాలి. 

78

వీరితో పాటు టీవీ నటుడు కౌశిక్ కృష్ణ, సెన్సేషనల్ సింగర్ బుల్లెట్ బండి ఫేమ్ మోహన భోగరాజు, యాంకర్ ధనుష్, పప్పీ మాస్టర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్ ఒకేలా ఉంటోంది అని.. అవే టాస్కులు.. అవే పనిష్మెంట్స్ తో విసుగు తెప్పిస్తున్నారనే విమర్శ ఉంది . 

88

మరి ఈ సీజన్ లో అయినా ప్లానింగ్, డిజైన్, టాస్కులు మారుస్తారేమో చూడాలి. త్వరలోనే బిగ్ బాస్ 6 ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితోపాటు ఇతర కంటెస్టెంట్ల ఎంపిక కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

click me!

Recommended Stories