ఇండియన్ ఆర్మీలో చేరడానికి అవసరమైన అన్ని రకాల అర్హత పరీక్షలలో మాధవన్ సక్సెస్ ఫుల్ గా పాస్ అయ్యాడు. కానీ దురదృష్టవశాత్తూ, వయస్సు పరిమితి నిబంధనల వల్ల ఆయనకు ఆర్మీలో చేరే అవకాశం కొద్దిలో చేజారిపోయింది. దాంతో తన ఆశయానికి బ్రేక్ పడినప్పటికీ, అధైర్యపడకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేశారు.
అమ్మాయిల మనసు దోచిన 'చాక్లేట్ బాయ్'
1990లలో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాధవన్, మొదట్లో రొమాంటిక్ సినిమాలతో అమ్మాయిల మనసు దోచుకున్నాడు. తన స్టైలిష్ లుక్స్, నేచురల్ నటనతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘చాక్లేట్ బాయ్’గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో నటించి అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.