తెలుగు నేటివిటీ, మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యువ నటుడు సత్యదేవ్ ఈ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. సత్యదేవ్ పాత్రపై ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో టెన్షన్ నెలకొంది. ఒరిజినల్ వర్షన్ లో సత్యదేవ్ రోల్ ని వివేక్ ఒబెరాయ్ చేశారు. తన రెండవ భార్య కుమార్తెకి డ్రగ్స్ ఇచ్చి ఆమె పట్ల కీచకుడిగా ప్రవర్తిస్తుంటాడు. అందరి ముందు మంచిగా నటిస్తూ కూతురిపైనే దారుణంగా వ్యవహరిస్తాడు.