కల్కి ఫస్ట్ హాఫ్ కావాలనే స్లోగా తీశా, కారణం ఇదే, కథ మొత్తం పార్ట్ 2 లో... నాగ్ అశ్విన్ ఇలా అనేశాడేంటి?

First Published Jul 5, 2024, 11:56 AM IST

ప్రభాస్ నటించిన కల్కి సూపర్ హిట్. అయితే కల్కి ఫస్ట్ హాఫ్ సంతృప్తికరంగా లేదు. చాలా స్లోగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కావాలనే కల్కి ఫస్ట్ హాఫ్ స్లోగా తీశాను అంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అందుకు ఆయన చెప్పిన కారణం ఆసక్తి రేపుతోంది.. 
 

Kalki 2829 AD Trailer


ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2829 AD. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా యూఎస్ లో కల్కి ప్రభంజనం మాములుగా లేదు. $12 మిలియన్ వసూళ్లకు పైగా రాబట్టింది. అక్కడ వంద కోట్ల మార్కు దాటేసింది. విదేశాల్లో కల్కి చిత్రానికి అంచనాలకు మించిన ఆదరణ దక్కుతుంది. 

Kalki 2829 AD Trailer


ప్రభాస్ భైరవ పాత్రలో అదరగొట్టారు. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ మెరుపులు మెరిపించారు. ప్రభాస్-అమితాబ్ కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కల్కి చిత్రానికి హైలెట్ అని చెప్పాలి. ఇక కాంప్లెక్సిటీ ఉన్న పాత్రలో పదుకొనె అద్భుతంగా నటించింది. కమల్ హాసన్ కనిపించింది తక్కువ సన్నివేశాల్లో అయినా ప్రభావం చూపారు. 
 

Latest Videos


Kalki 2829 AD

మొత్తంగా కల్కి సక్సెస్ అనడంలో సందేహం లేదు. అదే సమయంలో కల్కి చిత్రం మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. కల్కి ఫస్ట్ హాఫ్ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. చాలా నెమ్మదిగా సాగుతుంది. అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయని... మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. ఈ ప్రశ్నకు నాగ్ అశ్విన్ స్వయంగా సమాధానం చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కల్కి ఫస్ట్ హాఫ్ స్లోగా తెరకెక్కించామని ఆయన అన్నారు.. 
 

Kalki 2829 AD

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ...  నేను చూపించబోయే కొత్త ప్రపంచాన్ని, పాత్రలను పరిచయం చేయడానికే ఫస్ట్ హాఫ్ వాడుకున్నాను. ఎందుకంటే ఈ కొత్త ప్రపంచాన్ని, పాత్రలను ఆడియన్స్ అంగీకరిస్తారా లేదా అనే సందేహం మాలో ఉంది. అందులోనూ నలుగురు బడా స్టార్స్ ఈ మూవీలో ఉన్నారు. వారి మార్కెట్, స్టార్డం ఆధారంగా కథను బ్యాలన్స్ చేయాలి. 
 

Kalki 2829 AD

ఫస్ట్ హాఫ్ లో మూడు కొత్త ప్రపంచాలను ప్రేక్షకులకు పరిచయం చేయాలి. ఆడియన్స్ ఎక్కడా గందరగోళానికి గురికాకూడదు. అందుకే రిస్క్ తీసుకోకుండా స్లోగా మొదటి భాగం నడిపించాను... అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... అసలు కథ పార్ట్ 2 లో ఉంటుంది. మొదటి భాగంలో పాత్రల పరిచయంతో పాటు మా సినిమా కథ, పాత్రలు, అందులోని ప్రపంచాలు ఎలా ఉంటాయో చెప్పాము, అన్నారు. 
 

Kalki 2829 AD


నాగ్ అశ్విన్ మాటలు కల్కి పార్ట్ 2 పై మరింత ఆసక్తి రేపాయి. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్-అమితాబ్ మధ్య సంఘర్షణ మనం చూశాము. సెకండ్ హాఫ్ లో యాస్మిన్ పాత్ర చేస్తున్న కమల్ హాసన్ రంగంలోకి దిగుతాడు. అప్పుడు ప్రభాస్, అమితాబ్ కలిసి కమల్ హాసన్ ని కట్టడి చేయాల్సి ఉంటుంది. యాస్మిన్ భారి నుండి సుమతి కడుపులోని బిడ్డను ఎలా కాపాడుతారు? కల్కి రాక ఎలా ఉంటుంది? అనేది ఆసక్తికర పరిణామం.. 
 

click me!