రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత తనదైన శైలిలో కల్కి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద జూలు విదిల్చాడు. బాహుబలి తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కల్కి విందు భోజనంలా మారింది. సలార్ హిట్ అయినప్పటికీ కొందరికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ప్రస్తుతం కల్కి జైత్ర యాత్ర బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.
26
ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి కూడా కల్కి చిత్రాన్ని తొలిరోజే వీక్షించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. శ్యామల దేవి ఇటీవల పలు కార్యక్రమాలకి అతిథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద క్షత్రియ సేవ సమితి వారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు నిర్వహించారు.
36
ఈ కార్యక్రమానికి శ్యామలాదేవి అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత శ్యామల దేవి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన కామెంట్స్ రాంచరణ్ ఫ్యాన్స్ కి షాకిచ్చేలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించాలనుకున్నారు. కానీ కుదర్లేదు.
46
ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించారు. అది అద్భుతమైన చిత్రం. ఇప్పుడు ఎన్నో ఏళ్ళు గడచిపోయింది. మరోసారి అల్లూరి సీతారామరాజుని అందరూ వెండితెరపై చూడాలని అనుకుంటున్నారు. ప్రభాస్ ని అల్లూరిగా చూడాలనుకుంటున్నట్లు వీళ్లంతా నాతో చెప్పారు. వీళ్ళ కోరికని నేను ప్రభాస్ కి చెబుతాను.
56
ప్రభాస్ కనుక ఆ పాత్రలో నటిస్తే అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టినట్లే ఉంటుంది అని వీళ్లంతా తనతో చెప్పినట్లు శ్యామలాదేవి అన్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ పాత్రలో నటించాలని నేను ప్రభాస్ కి చెబుతానని ఆమె అన్నారు.
66
అంతా బాగానే ఉంది కానీ ఈ క్రమంలో రాంచరణ్ అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ అల్లూరి పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ పాత్రలో చరణ్ ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం అని అంటున్నారు. దీనికి రెబల్ స్టార్ అభిమానులు కూడా స్పందిస్తూ కౌంటర్లు వేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభాస్ అల్లూరిగా నటించే అవకాశం ఎంత ఉందో తెలియదు కానీ శ్యామలాదేవి కామెంట్స్ తో చర్చ అయితే మొదలైంది.