ఒక్క రాత్రికి 3 కోట్లు.. శిల్పా శెట్టి రెస్టారెంట్ ఆదాయం తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే ?

Published : Jan 16, 2026, 03:36 PM IST

ఒక్క రాత్రిలోనే కోట్లాది రూపాయల ఆదాయం సంపాదించే 'బాస్టియన్ ఎట్ ది టాప్' రెస్టారెంట్. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి  ముంబైలో  నడిపిస్తున్న ఈ రెస్టారెంట్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా? 

PREV
15
1,400 మంది కూర్చునే సామర్థ్యం

1,400 మంది కూర్చునే సామర్థ్యం ఉన్నా, బయట భారీ క్యూలు: బాస్టియన్ రెస్టారెంట్ రద్దీకి ఇదే నిదర్శనం.ప్రతి రాత్రి రెండు డిన్నర్ సీటింగ్స్‌లో 1,400 మందికి సేవలు అందిస్తున్నప్పటికీ, ఈ రెస్టారెంట్ ముందు ఎప్పుడూ పెద్ద క్యూ ఉంటుంది.

25
సెలబ్రిటీలు, సంపన్నుల అడ్డాగా

సెలబ్రిటీలు, సంపన్నుల అడ్డాగా ఉంది శిల్పా శెట్టి రెస్టారెంట్. లంబోర్ఘిని, ఆస్టన్ మార్టిన్ వంటి కార్లలో వచ్చి లక్షలు ఖర్చు చేసే అతిథులున్నారు. 2023లో ప్రారంభమైన ఈ రెస్టారెంట్, రూఫ్‌టాప్ పూల్, అద్భుతమైన ఇంటీరియర్స్‌తో ప్రముఖులు, సంపన్నులకు ఇష్టమైన ప్రదేశంగా మారింది.

35
రాత్రికి 3 కోట్ల ఆదాయం..

ముంబై నడిబొడ్డున శిల్పాశెట్టి విలాసవంతమైన రెస్టారెంట్, ఒక రాత్రికి 3 కోట్ల ఆదాయం.. దాదర్‌లోని కోహినూర్ స్క్వేర్‌లోని 48వ అంతస్తులో ఉన్న ఈ లగ్జరీ రెస్టారెంట్, దాని అద్భుతమైన ఆదాయంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

45
శిల్పా శెట్టి భాగస్వామ్యంతో మూడు నగరాల్లో..

బాస్టియన్ బ్రాండ్‌లో 50 శాతం వాటాతో సహ-యజమానిగా మారింది బాలీవుడ్ నటి శిల్పా శెట్టి… 2019లో రంజిత్ బింద్రాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న శిల్పా, ఈ బ్రాండ్‌ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ముంబై, గోవాలలో దీనికి శాఖలు ఉన్నాయి.

55
రెస్టారెంట్ బిజినెస్ లో బిజీ బిజీ..

వికెడ్ గుడ్' ఫుడ్ బ్రాండ్, కొత్తగా 'అమ్మకై' సౌత్ ఇండియన్ రెస్టారెంట్.బాస్టియన్ బ్రాండ్‌తో పాటు, శిల్పా శెట్టి 'వికెడ్ గుడ్' అనే ఫుడ్ బ్రాండ్‌లో కూడా భాగస్వామి. బాంద్రాలో 'అమ్మకై' అనే కొత్త రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించారు.

Read more Photos on
click me!

Recommended Stories