'కరుప్పు' సినిమాలో హీరో సూర్యను మించిపోయేలా నటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు నటుడు ఇంద్రన్స్. అసలు ఎవరీ ఇంద్రన్స్? ఆయన నేపథ్యం ఏంటి? ఈ గ్యాలరీలో చూద్దాం.
సూర్య హీరోగా నటించిన `కరుప్పు` మూవీ మిశ్రమ స్పందనతో రన్ అవుతుంది. మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. ఇందులో త్రిష నటన ఆకట్టుకుంది. సూర్య విశ్వ రూపం చూపించారు. నిజం చెప్పాలంటే, 'కరుప్పు' సినిమా మొదటి భాగంలో సూర్య కంటే ఇంద్రన్స్‌కే ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంది. మలయాళంలో ఫేమస్ యాక్టర్‌గా ఉన్న ఇంద్రన్స్‌కు ఈ సినిమాలో కూడా తన నటనకు పూర్తి న్యాయం చేసే పాత్ర దొరికింది. అందుకే ఆయన ఆ పాత్రలో జీవించేశారని చెప్పాలి.
25
ఈయన నటనకు ఫిదా అవ్వాల్సిందే
నగలు పోగొట్టుకుని పోలీస్ స్టేషన్‌లో దొంగలను బతిమాలుకునే సీన్ అయినా, బాధలో ఉన్న కూతురికి విజయ్ డైలాగ్ చెప్పి ధైర్యం నింపే సీన్ అయినా, కూతురు చనిపోయాక కోర్టు ఆవరణలో లాయర్లపై బంగారు నగలు విసిరి తన ఆవేదనను వెళ్లగక్కే సీన్ అయినా... ప్రతి సన్నివేశంలోనూ 'ఎవరీ నటుడు?' అనిపించేలా నటించారు. నిజానికి, 'కరుప్పు' మొదటి భాగాన్ని ఆయనే తన నటనతో ముందుకు నడిపించారు.
35
ఇంద్రన్స్ ఎవరు?
సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఆయన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన సినిమాల్లోకి రాకముందు దర్జీగా పనిచేశారు. నటనపై ఆసక్తితో, ఒక అమెచ్యూర్ ఆర్ట్ క్లబ్‌లో చేరి నాటకాల్లో నటిస్తూ తన నైపుణ్యానికి పదును పెట్టారు. ఆ తర్వాత 1981లో వచ్చిన 'చూతాట్టం' అనే మలయాళ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. చిన్న చిన్న పాత్రలు వేస్తున్న ఆయనకు 2016లో వచ్చిన 'మున్రోతురుత్' సినిమా కెరీర్‌లో పెద్ద బ్రేక్ ఇచ్చింది.
2018లో 'ఆలోరుక్కం' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. 2019లో 'వెయిల్మరంగళ్' సినిమాకు సింగపూర్ సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు. గత ఏడాది 'హోమ్' చిత్రంలో నటనకు జాతీయ అవార్డు కూడా దక్కింది. అయితే, ఆయన లక్ష్యం 10వ తరగతి పాసవ్వడం. కానీ 'సాక్షరత మిషన్' నిబంధనల ప్రకారం, 10వ తరగతి పరీక్ష రాయాలంటే 7వ తరగతి పాసై ఉండాలి. అందుకే ఆయన ఇటీవల 7వ తరగతి పరీక్ష రాశారు.
55
లైఫ్ మార్చిన సంఘటన
ఇటీవల జరిగిన 'నవకేరళసదాస్' కార్యక్రమంలో ఇంద్రన్స్ తన చదువుకోవాలనే కోరికను బయటపెట్టారు. అప్పుడే 10వ తరగతి పరీక్ష కోసం దరఖాస్తు కూడా ఇచ్చారు. మొదట తాను 4వ తరగతి వరకే చదివానని ఆయన చెప్పారు. కానీ, 'సాక్షరత మిషన్' అధికారులు ఆయన పాత స్కూల్ స్నేహితులను విచారించగా, ఆయన 7వ తరగతి వరకు బడికి వెళ్లినట్లు తెలిసింది. పుస్తకాలు, బట్టలు కూడా లేని పేదరికం వల్ల చదువు మధ్యలోనే ఆపేసి దర్జీ పనికి వెళ్లానని ఇంద్రన్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయినా, పుస్తకాలు చదివే అలవాటును మాత్రం ఆయన వదులుకోలేదు. అదే జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చిందని ఆయన పేర్కొన్నారు.