జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. పవన్ తాను పూర్తి చేయాల్సిన చిత్రాల షూటింగ్ ని ఇంకా తిరిగి ప్రారంభించలేదు. ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. ముందుగా పవన్ ఓజి చిత్రాన్ని ఫినిష్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దీనికి కారణం ఓజి షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇక కొద్దిరోజులు పవన్ డేట్లు ఇస్తే సరిపోతుంది.