మహేష్ బాబు యాక్టింగ్ చేయకుండా నిజంగానే ఏడ్చేసిన సన్నివేశం, పోకిరి కాదు ఇదే బెస్ట్..రాజమౌళి కూడా ఫిదా

First Published Sep 7, 2024, 11:24 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందుకున్నారు. అయితే మహేష్ బాబు పెర్ఫామెన్స్ పరంగా కొన్ని చిత్రాలు ఆణిముత్యాల్లా మిగిలిపోతాయి.

Actor Chinna

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందుకున్నారు. అయితే మహేష్ బాబు పెర్ఫామెన్స్ పరంగా కొన్ని చిత్రాలు ఆణిముత్యాల్లా మిగిలిపోతాయి. మహేష్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన వాటిలో మురారి, పోకిరి క్లైమాక్స్ ఇలా కొన్ని చెప్పుకోవచ్చు. 

ఒక చిత్రంలో మహేష్ బాబు ఎమోషనల్ గా నటించాలి. కానీ మహేష్ నిజంగానే ఏడ్చేశారు. దిగ్గజ డైరెక్టర్ రాజమౌళిని సైతం ఫిదా చేశాడు. ఆ మూవీ ఏంటి ? ఆ సన్నివేశం ఏంటి ? అని తెలుసుకునేందుకు వివరాల్లోకి వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 1 నేనొక్కడినే. ఈ చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్. కన్ఫ్యూజన్ డ్రామా వల్ల ప్రేక్షకులకు నచ్చలేదు. 

Latest Videos


అయితే ఒక సెన్షన్ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రాన్ని కల్ట్ మూవీగా భావిస్తారు. ఈ చిత్రంలో సుకుమార్ టేకింగ్, మహేష్ బాబు పెర్ఫామెన్స్ కి ప్రశంసలు కూడా దక్కాయి. ఇక రాజమౌళికి అయితే ఈ చిత్రం పిచ్చపిచ్చగా నచ్చేసింది. రాజమౌళి ఒక సందర్భంలో మాట్లాడుతూ మహేష్ బాబు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అంటే పోకిరి చిత్ర క్లైమాక్స్ లో నాజర్ చనిపోయినప్పుడు వచ్చే సీన్ అని రాజమౌళి అన్నారు. ఆ సన్నివేశంలో మహేష్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ అద్భుతం. 

ఇప్పుడు 1 నేనొక్కడినే క్లైమాక్స్ లో మహేష్ పెర్ఫామెన్స్ పోకిరి కంటే ది బెస్ట్ గా ఉందని రాజమౌళి ప్రశంసించారు. రాజమౌళి కామెంట్స్ పై ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు స్పందించారు. ఆయన చెప్పింది నిజం. ఎందుకంటే వన్ నేనొక్కడినే చిత్ర క్లైమాక్స్ లో నేను బుక్ పట్టుకుని ఏడ్చేస్తాను. అది యాక్టింగ్ కాదు. నిజంగానే ఏడుపు వచ్చేసింది. గౌతమ్ తన హ్యాండ్ రైటింగ్ తో స్వయంగా రాసిన అక్షరాలు ఆ బుక్ లో ఉన్నాయి. 

అవి చూడగానే నేను ఎమోషన్ ఆపుకోలేకపోయాను. సుకుమార్ నిజంగానే ఆ బుక్ లో గౌతమ్ హ్యాండ్ రైటింగ్ తో రాయించారట. అది చూడగానే నేను నేచురల్ గా ఎమోషనల్ అయ్యాను. ఆ సీన్ మొత్తం ఒక్క టేక్ లో కంప్లీట్ అయింది అని మహేష్ బాబు తెలిపారు. 

త్వరలో మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ప్రేపరేషన్స్ మొదలయ్యాయి. అయితే సినిమా లాంచ్ ఎప్పుడనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. భారీ అంతర్జాతీయ చిత్రంగా ఈ మూవీని తెరకెక్కించాలని రాజమౌళి భావిస్తున్నారు. 

click me!