ఓర్మాక్స్ మీడియా సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఇండియన్ టాప్ 10 హీరోల లిస్ట్ ని ప్రకటించింది. ఎన్టీఆర్ ఈ లిస్ట్ లో చోటు కోల్పోయాడు. మరి మిగిలిన హీరోల స్థానాలేంటో చూద్దాం.
ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియా టాప్ 10 హీరోలు, హీరోయిన్ల జాబితాని ఇస్తుంది. ఇప్పుడు మోస్ట్ పాపులర్ హీరోల జాబితాని విడుదల చేసింది. ఇందులో చిన్నపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ ఒక్క స్థానం పుంజుకున్నారు. ఎన్టీఆర్ లిస్ట్ లో చోటు కోల్పోయాడు. ఇక ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ సేమ్ కంటిన్యూ అవుతున్నారు. మరి ఇతర హీరోల పరిస్థితేంటో ఒక్క సారి చూద్దాం.
26
తిరుగులేని టాప్ స్టార్‌గా ప్రభాస్
ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్ నిలుస్తున్నారు. నేడు(అక్టోబర్ 23)న పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయన ఇండియన్ టాప్ 10 లిస్ట్ లో మొదటిస్థానంలో నిలిచారు. ఆయనకు ఇండియా వైడ్‌గా తిరుగులేదని చెప్పొచ్చు. అదే సమయంలో తన స్థానాన్ని టచ్ చేసే వారే లేని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ప్రభాస్ రాణిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్`, `కల్కి 2` చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే `కల్కి 2` షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
36
దుమ్మురేపిన అల్లు అర్జున్
రెండో స్థానంలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఉన్నారు. ఆయన ఆగస్ట్ నెలలో కూడా అదే స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలోకి అల్లు అర్జున్ వచ్చారు. ఆగస్ట్ లో ఆయన నాల్గో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఒక్క స్థానం మెరుగుపడ్డారు. దుమ్ములేపుతున్నారు. ప్రస్తుతం ఆయన `రాకా`లో నటిస్తున్న విషయం తెలిసిందే. గ్లోబల్ ఫిల్మ్ గా ఇది రూపొందుతోంది. అట్లీ దర్శకుడు. నాల్గో స్థానంలో తమిళనాడు సీఎం విజయ్ ఉన్నారు. ఆయన ఒక్క స్థానం పడిపోయారు.
ఐదో స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. మహేష్ గత కొంత కాలంగా అదే స్థానంలో ఉంటున్నారు. మహేష్ `వారణాసి` మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. గ్లోబల్ ఫిల్మ్ గా ఇది రూపొందుతుంది.
56
యష్ దూకుడు
ఆరో స్థానంలోకి యశ్ వచ్చాడు. ఆయన ఆగస్ట్ లో ఏడో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఆరో స్థానానికి ఎగబాకారు. ఇటీవల ఆయన `టాక్సిక్`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇది ఆడలేదు. ఇప్పుడు బాలీవుడ్‌లో `రామాయణం`లో నటిస్తున్నారు. ఇందులో రావణుడిగా కనిపించబోతున్నారు. దీంతో యష్ గురించి ఇండియా వైడ్‌గా చర్చ నడుస్తోంది. ఏడో స్థానంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఎనిమిదో స్థానంలో సూర్య ఉన్నారు. ఆగస్ట్ లో ఆయన 6వ స్థానంలో ఉండగా, రెండు స్థానాలు పడిపోయారు.
66
సేఫ్‌లో రామ్ చరణ్
రామ్ చరణ్ తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యారు. లిస్ట్ లో సేఫ్‌లో ఉన్నారు. ఆయన ఆగస్ట్ లో కూడా అదే స్థానంలో ఉన్నారు. చరణ్‌కి సంబంధించి కొత్త సినిమాలు ఇంకా సినిమాలు స్టార్ట్ కాలేదు. ఆయన గురించి పెద్దగా చర్చ లేదు. అందుకే ఆయన గ్రాఫ్ పెరగలేదు. పదో స్థానంలో `ధురంధర్` హీరో రణ్‌వీర్ సింగ్ ఉన్నారు. ఆయన ఆగస్ట్ లో కూడా అదే స్థానంలో ఉన్నారు. ఇక తెలుగు స్టార్ ఎన్టీఆర్ ఈ లిస్ట్ లో చోటు కోల్పోయారు. అలాగే అక్షయ్ కుమార్‌కి చోటు దక్కలేదు. కోలీవుడ్ నటుడు అజిత్ కూడా లిస్ట్ లోకి రాకపోవడం గమనార్హం.