Jailer 2 Movie 8 Days Collections: జైలర్‌ 2 కలెక్షన్లు తగ్గించిన టీమ్‌.. రజనీకాంత్‌ మూవీ 8వ రోజు ఎంత చేసిందంటే?

Published : Oct 23, 2026, 08:35 AM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన `జైలర్‌ 2` మూవీ రెండో వారంలోనూ జోరు చూపిస్తోంది. రోజువారి కలెక్షన్లు తగ్గినా.. ఓవరాల్‌గా మాత్రం సర్‌ప్రైజ్‌ చేసే వసూళ్లని రాబడుతోంది.

PREV
14
బాక్సాఫీసు వద్ద తగ్గని రజనీకాంత్‌ జోరు

రజనీకాంత్‌.. నటించిన `జైలర్‌ 2` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. కోలీవుడ్‌ లెక్కలు మార్చేస్తుంది. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సృష్టించే దిశగా వెళ్తోంది. ఆరువందల కోట్లు దాటింది. అంతేకాదు కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తోంది. ఎనిమిదో రోజు కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి. బుధవారంతో పోల్చితే కొద్దిగా తగ్గినా, గురువారం మంచి నెంబర్స్ రావడం విశేషం.

24
జైలర్‌ 2 8వ రోజు కలెక్షన్లు

గురువారం రోజు ఈ మూవీ ఇండియాలో రూ.17.15కోట్ల నెట్‌ కలెక్షన్లు వచ్చాయి. దాదాపు ఇరవై కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఓవర్సీస్‌లో ఐదు కోట్లు రాబట్టా, ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిదో రోజు రూ.25కోట్లు వచ్చాయి. ఓవరాల్‌గా ఈ సినిమాకి ఎనిమిది రోజుల్లో రూ.606.05కోట్లు రావడం విశేషం. అయితే ఇండియాలో రూ.391.55కోట్ల గ్రాస్‌, ఓవర్సీస్‌లో రూ.213.50కోట్లు వసూలు చేసింది. ఎనిమిదో రోజు తమిళంలో రూ.10.75కోట్లు, తెలుగులో రూ.3.60కోట్లు, హిందీలో రూ.2.40కోట్లు వచ్చాయి. కన్నడలో నలభై లక్షలు మాత్రమే రావడం గమనార్హం. ఓవరాల్‌గా తెలుగులో ఈసినిమా రూ.73.25కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఇంకా పదహారు కోట్లు వస్తే, తెలుగులో బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది.

34
కలెక్షన్లు తగ్గించిన జైలర్‌ 2 చిత్ర బృందం

ఇదిలా ఉంటే సాక్నిల్క్ వంటి సైట్లు ఈ కలెక్షన్లని ప్రకటించాయి. కానీ చిత్ర బృందం అధికారికంగా తక్కువ కలెక్షన్లని చూపించడం ఆశ్చర్యపరుస్తోంది. ఏడు రోజులు.. అంటే మొదటి వారం కలెక్షన్ల పోస్టర్‌ని గురువారం విడుదల చేసింది. ఇందులో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.549కోట్లు వచ్చినట్టుగా వెల్లడించింది. కానీ నిన్నటికి రూ.582కోట్లు వచ్చినట్టు సాక్నిల్క్ సైట్‌ ప్రకటించింది. ఈ లెక్కన చిత్ర బృందం తక్కువ ప్రకటిస్తున్నట్టుగా ఉంది. సాధారణంగా టీమ్‌ ఎక్కువ వసూళ్లని ప్రకటిస్తారు. ఈ సైట్‌లో తక్కువగా ఉంటాయి. కానీ విచిత్రంగా `జైలర్‌ 2`కి మాత్రం ట్రేడ్‌ సైట్లు ఎక్కువ కలెక్షన్లు ప్రకటించగా, టీమ్‌ తక్కువ నెంబర్లు వేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఇది కావాలని చేస్తున్నారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

44
మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తోన్న జైలర్‌ 2

రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన `జైలర్‌ 2` సినిమాలో రమ్యకృష్ణ, సూరజ్, యోగిబాబు, ఎస్‌ జే సూర్య, విద్యాబాలన్‌, మిథున్‌ చక్రవర్తి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, హృతిక్‌రోషన్‌, జాకీ షరాఫ్‌ క్యామియో రోల్స్ చేశారు. సన్‌ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ.300కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది ఆకట్టుకుంటోంది. రజనీకాంత్‌ మార్క్ స్టయిల్‌, యాక్షన్‌ అలరిస్తోంది. ఫ్యామిలీ ఎలిమెంట్లు, సెంటిమెంట్‌ సీన్లు అలరిస్తున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories