ఒక్క పాటకు అన్ని లక్షలా..? శ్రేయా ఘోషల్ ఒక్క సాంగ్ కు ఎంత తీసుకుంటుందో తెలుసా..?

Published : Mar 15, 2024, 04:28 PM IST

ఇండియాలో స్టార్ సింగర్స్ చాలా మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ను ఉర్రూతలూగించే గాయనీగాయకులు ఉన్నారు మన దేశంలో. అలాంటివారిలో శ్రియా ఘోషల్ ఒకరు. 

PREV
16
ఒక్క పాటకు అన్ని లక్షలా..? శ్రేయా ఘోషల్ ఒక్క సాంగ్ కు ఎంత తీసుకుంటుందో తెలుసా..?

 శ్రేయా ఘోషల్ ఇండియాన్ స్టార్ సింగర్. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీ గాయనిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. అన్ని భాషల్లో వేల పాటలు పాడింది శ్రియా. అంతే కాదు ఆమె ఏపాట పాడినా.. అమృతం కురిసినట్టు ఉంటుంది. తెలుగులో కూడా ఎన్నో పాటలు పాడింది శ్రీయా ఘోషల్. ఆమె పాటలు అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యాయి.. 
 

26

దేశ వ్యాప్తంగా శ్రేయా ఘోషల్ గాత్రానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎలాంటి పాటకైనా ఆమె పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారని చాలామంది అభిమానులు భావిస్తారు. ఇప్పటికే ఆమె అన్ని భాషల్లో కలిపి వేల పాటలు పాడింది. అయితే ఒక్క పాటకు ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా..? 
 

36

శ్రీయా ఘోషల్ పాట పాడిన సినిమాలో ఒక్క పాటతో అయిపోదు.. సినిమాలో కనీసం రెండు మూడు పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆమె పాటలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా..  ఒక్క పాటకు శ్రేయా ఘోషల్ 25 లక్షల రూపాయల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. 

46

మన దేశంలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకునే సింగర్లు చాలా తక్కువమంది ఉన్నారు. శ్రేయా ఘోషల్ పాట పాడితే ఆడియో రైట్స్ సైతం ఎక్కువ మొత్తానికి అమ్ముడవుతాయి. చిన్న వయస్సులోనే శ్రేయా ఘోషల్ సింగర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు.  1998 సంవత్సరం నుంచి ఆమె సింగర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. 
 

56

ఎంతోమంది సింగర్లు ప్రతి సంవత్సరం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నా వాళ్లు శ్రేయా ఘోషల్ కు పోటీ ఇవ్వలేకపోతున్నారు. 15కు పైగా భాషల్లో శ్రేయా ఘోషల్ పాటలు పాడారు. బాలీవుడ్ మూవీ దేవదాస్ తో శ్రేయా ఘోషల్ కెరీర్ మొదలైంది. శ్రేయా ఘోషల్ ప్రతిభకు ఎన్నో అవార్డులు వచ్చాయి. పలు టీవీ రియాలిటీ షోలకు శ్రేయా ఘోషల్ జడ్జిగా పని చేశారు. శ్రేయా ఘోషల్ టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో 5 సార్లు స్థానం సంపాదించుకున్నారు.
 

66

మరికొన్ని సంవత్సరాల పాటు శ్రేయా ఘోషల్ కెరీర్ పరంగా మరింత బిజీగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. శ్రేయా ఘోషల్ స్థాయిలో పేరు సంపాదించుకోవడం మరో సింగర్ కు సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శ్రేయా ఘోషల్ తన సింగింగ్ టాలెంట్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
 

click me!

Recommended Stories