రాజమౌళి కాదు.. శంకర్ కాదు.. ఇండియాలోనే రిచ్చెస్ట్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

First Published Jun 27, 2024, 12:06 PM IST

ఇండియాలో రిచ్చెస్ట్ డైరెక్టర్ ఎవరోతెలుసా..? ఆ ఎవరై ఉంటారు.. ఏ రాజమౌళినో.. శంకర్ కాని..  సంజల్ లీలా బన్సాలి లాంటి వారు అయి ఉంటారులే అనుకుంటున్నారు కదా..? అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఇంతకీ ఇండియన్ రిచ్చెస్ట్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? 

ఇండియాలో గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు. అందులో రాజమౌళి.. సంజయ్ లీలా భన్సాలీ, హిరానీ, రాజమౌళి, రోహిత్ శెట్టి, శంకర్  ఇలా ఎంతో మంది దర్శకలు మంచి మంచి సినిమాలతో టాప్ దర్శకులిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇండియాలో భారీగా ఆస్తులు కలిగి ఉన్న రిచ్చెస్ట్ దర్శకుడు ఎవరో మీకు తెలుసా..? తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. 
 

ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటులు, నటీమణులు మాత్రమే సంపన్నులు కాదు. భారతదేశంలో చాలా మంది దర్శకులు స్టార్‌డమ్‌లో వెలుగు వెలుగు తున్నారు. చేతినిండా సంపాదిస్తూ.. ఆస్తులు వెనకేసుకుంటున్నారు.  భారతదేశంలోని అత్యంత ధనవంతులైన దర్శకులు.. స్టార్ హీరోలను మించి సంపాదిస్తూ.. వారికంటే ఆస్తిపరులుగా ఉన్నారని మీకు తెలుసా..? 

 బాక్సాఫీస్ వద్ద 100% రికార్డును కలిగి ఉండి... ఇండియాలోనే అత్యంత సంపన్న దర్శకుడుగా రికార్డ్ సాధించిన దర్శకుడు మరెవరో కాదు కరణ్ జోహార్. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ 200 మిలియన్ డాలర్ల అంటే సుమారు రూ. 1700 కోట్లు) నికర ఆస్తుల విలువతో భారతదేశపు అత్యంత సంపన్న దర్శకుడిగా అవతారం ఎత్తాడు. .

కరణ్ జోహార్ 25 సంవత్సరాలకు పైగా అర డజను చిత్రాలకు దర్శకుడిగా మరియు భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. బాలీవుడ్ లో ఆయన సినిమాలదే హావా నడిచేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ ను ప్రభావితం చేసే వ్యాక్తులలో ఆయన ముందుఉంటారు. 
 

ఇక ఆయన తరువాత ప్లేస్ లో  స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ  ఉన్నారు. ఆయన ఆస్తులు నికర విలువ  1300 కోట్లు,  ఆతరువాత ప్లేస్ లో సంజయ్ లీలా భన్సాలీ  ఉండగా.. ఆయన ఆస్తుల నికర విలువ  900 కోట్లు. ఈ విషయంలో  కరణ్ జోహార్ అగ్రస్థానంలో ఉన్నారు. SS రాజమౌళి అత్యంత సంపన్నమైన నాన్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ గా ఉన్నారు. ఇక అటు తమిళ చిత్రసీమలో అత్యంత ధనిక దర్శకుడుగా  శంకర్ ఉన్నారు.
 

కరణ్ జోహార్ 25 ఏళ్లుగా సినిమాలను నిర్మిస్తున్నాడు. నిజానికి అతని సినిమాలన్నీ 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి. దర్శకుడిగా అతని ప్రయాణం 1998లో కుచ్ కుచ్ హోతా హైతో ప్రారంభమైంది. అప్పట్లో ఈ సినిమా 107 కోట్లు రాబట్టింది.

దీని తర్వాత 2001లో కభీ ఖుషీ కభీ కమ్ 136 కోట్లు వసూలు చేయగా.. 2006లో కభీ అల్విదా నా కెహ్నా 113 కోట్లు వసుళ్ళు సాధించింది.  అతని మొదటి సవాలు 2010లో మై నేమ్ ఈజ్ గాన్. భారతదేశంలో అది సరిగ్గా ఆడలేదు. అయితే ఓవర్సీస్‌లో విజయం సాధించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 223 కోట్లు వసూలు చేసింది.
 

జోహార్ 2012 చలనచిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌లో యువ నటులతో ప్రయోగాలు చేశాడు. 2016లో ఏ దిల్ హై ముష్కిల్ రిలీస్ అవ్వగా అది 240 కోట్లు కొల్ల కొట్టింది.  గత సంవత్సరం, అతను రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ ని తెరకెక్కించగా.. ఆ సినిమా 355 కోట్లు వసూళ్లు సాధించింది.
 

Latest Videos

click me!