కొడుక్కి ఉద్యోగం పోయిందంటే ఏ తల్లిదండ్రులైనా తల్లడిల్లిపోతారు. కానీ ఇక్కడో నటుడు ఐటీ ఉద్యోగం మానేసి, ఇంట్లోవాళ్లకు వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ షిఫ్ట్ అని అబద్ధం చెప్పాడు. కట్ చేస్తే, సినిమాతో ఏకంగా వంద కోట్లు సంపాదించి చూపించాడు.
నటుడు ప్రదీప్ రంగనాథన్ సినిమాల్లోకి రాకముందు ఓ ఐటీ కంపెనీలో పనిచేసేవారు. కానీ నటనపై ఉన్న పిచ్చితో, ఎలాగైనా సినిమాల్లోకి రావాలని తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
24
తల్లిదండ్రులను నమ్మించి
సినిమా అవకాశాల కోసం ప్రదీప్ దాదాపు ఏడాదిన్నర పాటు ఇంట్లో అబద్ధం చెప్పాడు. నైట్ షిఫ్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి తల్లిదండ్రులను నమ్మించాడు. ఈ విషయం వాళ్ల అమ్మకు మాత్రమే తెలుసు, నాన్నకు తెలియదు. పగలంతా నిద్రపోయి, రాత్రిళ్లు యాడ్స్, స్క్రిప్ట్ పనులు చేసుకునేవాడు.
34
హ్యాట్రిక్ హిట్ హీరో..
ప్రదీప్ ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ నటుడు, దర్శకుడు. తన మొదటి మూడు సినిమాలతో వరుసగా రూ.100 కోట్లు వసూలు చేసి హ్యాట్రిక్ కొట్టిన మొదటి భారతీయ నటుడిగా రికార్డ్ సృష్టించాడు.
'లవ్ టుడే', 'డ్రాగన్', 'డ్యూడ్' వంటి సినిమాలు అతనికి మంచి విజయాన్ని అందించాయి. ఇటీవల వచ్చిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. కన్న కలల కోసం పెద్ద రిస్క్ తీసుకుని, చివరికి విజయం సాధించాడు ప్రదీప్.