అన్ని భాషల్లో సక్సెస్ కొట్టిన కెజిఎఫ్ 2 (KGF Chapter 2) చిత్రానికి సీక్వెల్ ఉందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అలాగే ప్రశాంత్ నీల్ అప్ కమింగ్ చిత్రాలన్నీ, ఒకదానితో మరొకటి లింక్ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అంటే ప్రభాస్ సలార్, ఎన్టీఆర్ తో చేయనున్న మూవీ కథలు కెజిఎఫ్ కథతో ముడిపడి ఉంటాయనే ఓ వాదన ఉంది. కెజిఎఫ్ 2 లోని కొన్ని పాత్రలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. నెక్స్ట్ చిత్రాలకు ఆయన కథలో లీడ్ వదిలినట్లు తెలుస్తుంది.