షాకింగ్..కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరైన 55 మంది గెస్ట్ లకు కోవిడ్ పాజిటివ్, స్టార్ హీరోకి కూడా..

Published : Jun 05, 2022, 10:12 AM ISTUpdated : Jun 05, 2022, 05:20 PM IST

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ 50వ జన్మదిన వేడుకలు మే 25న ఘనంగాజరిగిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ బాలీవుడ్ లో అజాతశత్రువు.

PREV
16
షాకింగ్..కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరైన 55 మంది గెస్ట్ లకు కోవిడ్ పాజిటివ్, స్టార్ హీరోకి కూడా..

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ 50వ జన్మదిన వేడుకలు మే 25న ఘనంగాజరిగిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ బాలీవుడ్ లో అజాతశత్రువు. ఆయనకు బాలీవుడ్ లో మాత్రమే కాక సౌత్ చిత్ర పరిశ్రమలలో ప్రముఖులతో మంచి పరిచయాలు ఉన్నాయి. బాహుబలి చిత్రాన్ని హిందీలో మార్కెట్ లో విజయవంతంగా రిలీజ్ చేసిన నిర్మాత ఆయన. 

26
karan johar

కరణ్ బర్త్ డే పార్టీకి బాలీవుడ్ నుంచి మాత్రమే కాక సౌత్ నుంచి కూడా హీరోయిన్లు, సెలెబ్రిటీలు హాజరయ్యారు. అయితే కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ గురించి షాకింగ్ న్యూస్ ఒకటి సెన్సేషనల్ గా మారింది. బాలీవుడ్ సెలెబ్రటీల గుండెల్లో గుబులు రేపుతోంది. 

36

కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరైన గెస్ట్ లలో దాదాపు 55 మందికి కరోనా సోకినట్లు విశ్వసనీయ సమాచారం. దీని గురించి అధికారికంగా కరణ్ జోహార్ కానీ, బాలీవుడ్ సెలెబ్రటీలు కానీ స్పందించలేదు. అయితే ఇది నిజం అంటూ బలమైన రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. ఎవరెవరికి కోవిడ్ సోకింది అనే లెక్కలు బయటకి రావడం లేదు. 

46

ప్రస్తుతం కోవిడ్ ప్రభావం బాగా తగ్గింది. దీని గురించి చర్చ కూడా జరగడం లేదు. ప్రజల్లో కూడా కోవిడ్ గురించి భయాందోళనలు తొలగిపోయాయి. అయితే గత కొన్ని రోజులుగా కోవిద్ కేసులు స్వల్పంగా పెరిగినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంతలోనే కరణ్ జోహార్ పార్టీలో 55 మంది గెస్ట్ లో వైరస్ కి ఇన్ఫెక్ట్ అయ్యారనే న్యూస్ సంచనలంగా మారింది. 

56

అనుమానాల్ని పెంచుతున్న మరో విషయం ఏంటంటే.. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ రెండవసారి కరోనా బారీన పడ్డాడు. నిన్ననే కార్తీక్ ఈ విషయాన్ని ప్రకటించాడు. కార్తీక్ గత ఏడాది మార్చ్ లో కోవిడ్ బారిన పడి కోలుకున్నాడు. మరోసారి అతడికి కోవిడ్ సోకింది. కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులాయ 2 చిత్రం మే 20న రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

66

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కార్తీక్ ఆర్యన్.. హీరోయిన్ కియారా అద్వానీ, సీనియర్ నటి టబు లతో కలసి తిరిగాడు. టబు, కియారా ఇద్దరూ కరణ్ జోహార్ బర్త్ డే  పార్టీకి హాజరయ్యారు. వీరిద్దరికి కరోనా సోకిందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.కార్తీక్ ఆర్యన్ కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరు కాలేదు. అయితే హీరోయిన్ల నుంచి అతడికి కోవిడ్ సోకిందా లేక అతడి నుంచే వైరస్ కరణ్ జోహార్ పార్టీకి వెళ్లిందా అనేది తేలాల్సి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories