అందరి ముందు వర్షని ముద్దడిగిన ఇమ్మాన్యుయెల్‌.. తనపై ఉన్న కోరికలు బయటపెట్టాలంటూ ఒత్తిడి.. అంతా షాక్‌

Published : Jun 14, 2023, 09:26 AM ISTUpdated : Jun 14, 2023, 12:44 PM IST

`జబర్దస్త్` కామెడీ షోలో టాప్‌ క్రేజీ జోడీగా నిలుస్తున్నారు వర్ష, ఇమ్మాన్యుయెల్‌ జంట. ఈ ఇద్దరు కలిసి చేసే స్కిట్లు హైలైట్‌గా నిలుస్తుంటాయి. అదేసమయంలో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంతే హాట్‌ టాపిక్‌గానూ మారుతుంటుంది.   

PREV
15
అందరి ముందు వర్షని ముద్దడిగిన ఇమ్మాన్యుయెల్‌.. తనపై ఉన్న కోరికలు బయటపెట్టాలంటూ ఒత్తిడి.. అంతా షాక్‌

ఇమ్మాన్యుయెల్‌, వర్ష ల మధ్య లవ్‌ ఉందని, ఈ ఇద్దరు రిలేషన్‌ షిప్‌లో ఉన్నారనేది ఈ ఇద్దరి అభిమానుల మాట, సోషల్‌ మీడియా మాట. షోలో ఈ ఇద్దరు కూడా అలానే ప్రవర్తిస్తుంటారు. తమ ప్రేమని, తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ని ప్రతింబించేలా ఈ ఇద్దరు స్కిట్లు చేస్తుంటారు. అవి అంతే హైలైట్‌గా నిలుస్తుంటాయి. అయితే షో కోసం ఇలా చేసినా, రియల్‌ లైఫ్‌లోనూ ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనేది తరచూ వినిపించేలా మాట. 
 

25

ఇప్పటి వరకు షోలో ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. ఎంగేజ్‌మెంట్లు చేసుకున్నారు. పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయారు. ఎన్నో డ్యూయెట్లు పాడుకున్నారు. షోని రక్తికట్టించడం కోసం చేసినా, చూసే ఆడియెన్స్ మాత్రం సీరియస్‌గానే తీసుకున్నారు. తాజాగా ఇమ్మాన్యుయెల్‌ పెద్ద బాంబ్‌ పేల్చాడు. తన కోరికలను బయటపెట్టాడు. ఇన్నాళ్లు దాచుకున్న మనసులోని మాటని బయటపెట్టాడు ఇమ్మాన్యుయెల్‌. అందరి ముందు వర్షని ముద్దడి షాకిచ్చాడు. 
 

35

లేటెస్ట్ ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో.. ఇమ్మాన్యుయెల్‌, వర్ష మాంత్రికుల వేషం వేశారు. ఇందులో ఇమ్మూ, వర్ష మాంత్రికులుగా వచ్చి, తాను గొప్ప మాంత్రికుడిని అని చెప్పగా, గురువుగారు.. మా అక్కబావాలను మీ శక్తితో కలపొచ్చు కదా అని వర్ష అడగ్గా, మీ అక్కా బావ ఇక్కడ కలవడం లేదు, బయట బాగానే కలుసుకుంటున్నారని, మనం మాత్రం ఇక్కడే బయట ఏంలేదు, కొంచెం చూడు అని చెప్పగా, వర్ష ఆశ్చర్యపోయింది. 

45

అనంతరం నాకు రాత్రిళ్లు నిద్ర పడటం లేదని, నిద్ర పట్టాలంటే ఏదైనా మంత్రం చెప్పమంది, దీంతో ఓం భీం ఇమ్మూ.. ముద్దు పెట్టు అంటూ చెప్పాడు ఇమ్మాన్యుయెల్‌, వర్ష కూడా అదే విధంగా చెప్పింది. ముద్దు విషయం వచ్చేసరికి ఆమె షాక్‌కి గురయ్యింది. ఇవి మంత్రాల్లా లేవని, మీ కోరికలుగా ఉన్నాయని చెప్పగా, నీ కోరికలుగా కూడా అవే బయటపెట్టూ అంటూ మంత్రం నీళ్లు చల్లడం విశేషం. దీంతో షో మొత్తం నవ్వులతో దద్దరిల్లింది. 
 

55

మొత్తానికి ఇమ్మాన్యుయెల్‌.. వర్షని ముద్దడగడం షోలో హైలైట్‌గా నిలవగా, దానికి వర్ష రియాక్షన్‌ అంతే హైలైట్‌ అయ్యింది. వీరి స్కిట్ నవ్వులు పూయించింది. వీరితోపాటు బాబు, కొత్తగా వచ్చిన అమ్మాయి శ్రీవిద్యల కామెడీ సైతం నవ్వులు విరిసేలా చేసింది. కొత్త అమ్మాయి తనదైన పంచ్‌లతో అదరగొట్టింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories