సమంత దారిలోనే లావణ్య త్రిపాఠి.. అవన్నీ ఉత్తమాటలేనా?

Published : Jun 14, 2023, 08:05 AM IST

అందాల రాక్షసిగా తెలుగు ఆడియెన్స్ ని అలరించిన లావణ్య త్రిపాఠి.. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ ని బుట్టలో పడేసింది. ఆయన మాయలో పడిపోయింది. ఈ ఇద్దరు ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సినిమా కెరీర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చిందీ సొట్టబుగ్గల సుందరి.   

PREV
15
సమంత దారిలోనే లావణ్య త్రిపాఠి.. అవన్నీ ఉత్తమాటలేనా?
Varun Tej - Lavanya Tripathi engagement

లావణ్య త్రిపాఠి, వరుణ్‌ తేజ్‌ నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. మెగా ఫ్యామిలీ, బంధుమిత్రుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు ఒక్కటి కాబోతున్నారు. త్వరలో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. `మిస్టర్‌` సినిమా నుంచి ఈ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లికి సిద్ధమవడం విశేషం. 
 

25

ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి తమ ఇంటికి కోడలుగా రావాలంటే మెగా ఫ్యామిలీ నుంచి కండీషన్స్ పెట్టారట. సినిమాలు చేయోద్దని చెప్పినట్టు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరోవైపు లావణ్య త్రిపాఠి సైతం వరుణ్‌కి ఓ కండీషన్‌ పెట్టిందట. తనకిష్టమైన క్లాసికల్‌ డాన్సు ప్రదర్శనలు ఇచ్చేందుకు అభ్యంతరం చెప్పొద్దని, అలాగే సినిమా ప్రొడక్షన్‌లో తాను కొనసాగుతాననే కండీషన్‌ పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. 
 

35

ఈ నేపథ్యంలో తాజాగా లావణ్య త్రిపాఠి ఒకేసారి మూడు ప్రాజెక్ట్ లను ప్రకటించింది. లావణ్య త్రిపాఠి చేయబోతున్న మూడు సినిమాల వివరాలను ప్రకటించింది పీఆర్‌ టీమ్‌. ఇందులో తమిళంలో అథర్వతో ఓ సినిమా చేస్తుంది. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా చేస్తుందట. దీంతోపాటు అన్నపూర్ణ స్టూడియోస్‌, హాట్‌ స్టార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ఓ వెబ్‌ సిరీస్‌లోనూ లావణ్య నటిస్తుందట. ఈ మూడు ప్రస్తుతం ఆమె కమిట్‌ అయిన ప్రాజెక్ట్ లు అని వెల్లడించింది. 

45

ఈ లెక్కన.. లావణ్య త్రిపాఠికి మెగా ఫ్యామిలీ పెట్టిన కండీషన్‌ అనేది ఉత్త మాటలే అని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టమవుతుంది. అయితే ఇవి ఎంగేజ్‌మెంట్‌కి ముందే ఒప్పుకున్న సినిమాలు. దీంతో ఈ సినిమాలు చేసి లావణ్య యాక్టింగ్‌ కి గుడ్‌ బై చెబుతుందా? లేక యదావిధిగా కంటిన్యూ అవుతుందా? అనేది మాత్రం సస్పెన్స్. దీనికి మున్ముందు స్పష్టత రావాల్సి ఉంది. 
 

55

అయితే సమంత, నయనతార, కాజల్‌ వంటి కథానాయికలు పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలు మూవీస్‌లో నటిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారు మారుతూ మూవ్‌ అవుతున్నారు. వారి భర్తల సహకారంతో ముందుకు సాగుతున్నారు. సమంత పెళ్లి తర్వాత చాలా సినిమాలు చేసింది. నాగచైతన్యతోపాటు ఇతర హీరోలతోనూ నటించింది. మరోవైపు నయనతార సైతం ఎలాంటి అభ్యంతరం లేకుండా సినిమాలు చేస్తుంది. కాజల్‌ కూడా ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుంది. దీంతో వీరి దారిలోనే లావణ్య త్రిపాఠి పయనిస్తుందని తాజాగా ఆమె ప్రకటించిన మూడు సినిమాలను బట్టి తెలుస్తుంది. మరి ఈ మూడు సినిమాలు చేసి యాక్టింగ్‌ మానేస్తుందా? లేక కంటిన్యూ అవుతుందా? అనేది మున్ముందు చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories