చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో రజినీకాంత్ విలేకరులతో మాట్లాడారు. తనపై వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చారు. తాను, స్టాలిన్ దాదాపు 40 ఏళ్లుగా స్నేహితులమని.. ఆ బంధం రాజకీయాలు, సిద్ధాంతాలకు అతీతమైనదని చెప్పారు రజినీకాంత్. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, స్టాలిన్ ఓటమి తనను చాలా బాధించిందని, ఆ బాధను పంచుకోవడానికే స్టాలిన్ ను కలిసినట్టు ఆయన చెప్పారు.