అతిలోక సుందరి శ్రీదేవి స్టార్ హీరోలందరితో సూపర్ హిట్ సినిమాలు చేసింది. కానీ బాలకృష్ణ - శ్రీదేవి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాకపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ల కాంబినేషన్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కానీ కొన్ని కాంబినేషన్లు మాత్రం ఇంత వరకూ వెండితెరపై సందడి చేసింది లేదు. అందులో నాగార్జున రంభ, ప్రభాస్, సమంత ఇలా కొన్ని కాంబినేషన్లలో సినిమాలు అస్సలు రాలేదు. ఈక్రమంలోనే బాలయ్య, శ్రీదేవి కాంబోలో కూడా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆడియన్స్ చూడలేకపోయారు. దానికి కారణం బాలకృష్ణ పెట్టుకున్న నియమమేనా? ఇంతకీ ఏంటా రూల్?
25
బాలయ్య 50 ఏళ్ల సినిమా కెరీర్
నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ... ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా 50 ఏళ్ల సినిమా కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నాడు నటసింహం. ఈక్రమంలో ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా ఆయనకు సన్మానం చేయాలని ప్లాన్ చేసింది. అయితే బాలకృష్ణ తన 50 ఏళ్ళ సినిమా కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు.. ఆయన సినిమాలో నటించి స్టార్ డమ్ పొందిన తారలు చాలామంది ఉన్నారు. అయితే, శ్రీదేవి మాత్రం ఆయనతో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు.
35
ఎన్టీ రామారావుతో ఆడిపాడిన శ్రీదేవి..
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన శ్రీదేవి.. అతిలోక సుందరి అన్న బిరుదు కూడా సాధించింది. ఆతరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. బోనీకపూర్ ను పెళ్లాడి.. బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది శ్రీదేవి. అయితే సౌత్ లో వరుసగా సినిమాలు చేస్తూ.. హిట్ మీద హిట్లు కొట్టిన టైమ్ లో.. శ్రీదేవితో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలు బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. కానీ బాలకృష్ణ మాత్రం శ్రీదేవితో సినిమా చేయనని చెప్పేశారని సమాచారం. బాలకృష్ణ శ్రీదేవితో సినిమా చేయకపోవడానికి ఒక కారణం ఉంది. శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసింది. గతంలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన అతిలోకసుందరి.. ఆతరువాత కాలంలో ఎన్టీఆర్ తో కలిసి.. ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది.
తన తండ్రితో కలిసి హీరోయిన్ గా నటించని శ్రీదేవితో తాను నటించలేనని, అది సరైన పద్దతి కాదు అని బాలకృష్ణ అనుకున్నారట. అందుకే శ్రీదేవి జోడీగా మూవీ అస్సలు చేయను అని చెప్పేశాడట. అంతే కాదు శ్రీదేవితో తనది సరైన కాంబినేషన్ కాదు అని బాలకృష్ణ అభిప్రాయం, అందుకే.. తనకు జోడీగా సెట్ అవ్వకుండా శ్రీదేవిని తన సినిమాకు తీసుకోను అని బాలయ్య ఓ సందర్భంలో వెల్లడించినట్టు తెలుస్తోంది. అలా బాలయ్య, శ్రీదేవి కాంబో రెండు మూడు సార్లు మిస్ అయ్యింది. అసలు వీరిద్దరితో సూపర్ హిట్ సినిమాలు చేయాలని దర్శకనిర్మాతలు చాలామంది ప్రయత్నించారట కానీ.. బాలయ్య తన నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని తెగేసి చెప్పడంతో.. ఆ ప్రయత్నాలు విరమించారట.
55
దూసుకుపోతున్న బాలయ్య..
65 ఏళ్ల వయసులో బాలయ్య దూసుకుపోతున్నాడు. వరుస సక్సెస్ లతో దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు సూపర్ హిట్లు అందుకున్న బాలకృష్ణ.. డబుల్ హ్యాట్రిక్ దిశగా ప్లాన్ చేస్తున్నాడు. అఖండ2తో త్వరలో ఫ్యాన్స్ ను పలకరించబోతున్నాడు నటసింహం. ఈసినిమా తరువాత మలినేని గోపీచంద్ తో మరో సినిమా ప్లాన్ చేశాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే.. బాలకృష్ణ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ హిట్ పడినట్టే. ప్రస్తుతం ఫ్యాన్స్ చూపంతా..అఖండ తాండవం మీదే ఉంది.