
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో కారు కొనేందుకు ఫైనాన్స్ ఆఫీస్ కు అప్పు కోసం వెళతాడు ధీరజ్. డౌన్ పేమెంట్ రెండు లక్షలు కావాలని మీ దగ్గర ఫైనాన్స్ ఉందా అని అడుగుతాడు. దానికి షూరిటీ ఏం పెడతావని అడుగుతాడు వ్యాపారి. డిగ్రీ సర్టిఫికెట్లు ష్యూరిటీగా పెడతానని చెబుతాడు ధీరజ్. దానికి ఆ వ్యాపారి సర్టిఫికెట్స్ తీసుకొని ఎవడు డబ్బులు ఇవ్వడు, మీకు డబ్బులు కావాలంటే ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ స్థలం కానీ ష్యూరిటీ పెట్టాలి అని చెబుతాడు. దానికి ధీరజ్ ‘నా దగ్గర ఏ ఆస్తులు లేవు, దయచేసి హెల్ప్ చేయండి. మీ డబ్బులు వడ్డీతో సహా ఇచ్చేస్తాను. నమ్మండి’ అని బతిమిలాడుతాడు. దానికి ఆ వ్యాపారి ‘డబ్బులు విషయం, నమ్మకంతో ఏది ఇవ్వలేము, పోనీ ఈ ఊర్లో పలుకుబడి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే ష్యూరిటీ సంతకం చేయించు. అప్పుడు డబ్బులు ఇస్తాను’ అంటాడు.
అప్పుడు ప్రేమ ‘వీళ్ళ నాన్నగారు రామరాజు గారు. ఆయన సంతకం చేస్తే సరిపోతుందా’ అని అడుగుతుంది. అప్పుడు ఫైనాన్స్ వ్యాపారి ‘రామరాజు గారు అంటే రైస్ మిల్లు ఓనరా’ అని అడుగుతాడు. అవును ఆయనే అని చెబుతుంది ప్రేమ. అప్పుడు ఆ వ్యాపారి ‘రామరాజు కొడుకుని చెబితే ఇంత డిస్కషన్ ఉండేది కాదు కదా. మీ నాన్నగారికి రెండు లక్షలు అంటే పెద్ద లెక్క కాదు, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు’ అని అడుగుతాడు. అప్పుడు ధీరజ్ ‘లేదు సార్ మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదు’ అని చెబుతాడు. వెంటనే ఆ వ్యాపారి ‘నీకు ఆత్మాభిమానం ఎక్కువలా ఉంది. నీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఏదైనా ఆస్తిని ష్యూరిటీగా పెట్టు ,లేదా మీ నాన్నతో ష్యూరిటీ సంతకం చేయించి తీసుకురా, అప్పుడే డబ్బులు ఇస్తాను’ అని చెబుతాడు. దాంతో ప్రేమ, ధీరజ్ బయటికి వచ్చేస్తారు.
ఇక్కడి నుంచి సీన్ ఇడ్లీ బాబాయ్ దగ్గరికి మారుతుంది. ఇడ్లీ బాబాయ్ కి పంచె, లాల్చి వేసి భాగ్యం రైస్ మిల్లులో పర్మినెంట్ గా సెటిల్ అవ్వాలని చెబుతుంది. రైస్ మిల్లు కి వెళ్ళాక రామరాజు కుర్చీలో కూర్చుంటాడు ఇడ్లీ బాబాయ్. అక్కడ కూర్చుని ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు. ఇక భాగ్యం ఫోన్లో ఏం చేయాలో చెబుతూనే ఉంటుంది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకుని ఉండు, నువ్వు అదే కుర్చీలో పర్మినెంట్గా సెటిల్ అవ్వాలి, మర్రిచెట్టుల పాతుకుపోవాలి అని చెబుతూ ఉంటుంది. చివరికి మిల్లుని మన సొంతం చేసుకోవాలి అని కూడా ఇద్దరూ మాట్లాడుకుంటారు.
ఇక ఇక్కడి నుంచి సీన్ రామరాజు దగ్గరికి మారుతుంది. రామరాజు ఇంట్లో జరుగుతున్న గొడవలు తలచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో వేదవతి నీళ్లు పట్టుకుని వస్తుంది, కాఫీ తాగుతారా? టీ తాగుతారా? భోజనం తింటారా? అని హడావిడి పడుతూ ఉంటుంది. వెంటనే రామరాజు ఎందుకు అలా చేస్తున్నావ్? నేను ఇంట్లో ఉంటే నీకు ఇబ్బందిగా ఉందా? అంటాడు. కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు అని అంటాడు. వెంటనే వేదవతి ‘అవునండి మీరు ఇలా బాధపడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నా. పెళ్లయిన ఇన్నాళ్లలో ఎప్పుడూ మీరు ఇలా ఇంట్లో ఎక్కువ రోజులు లేరు. మిల్లుకు వెళితేనే బావుంటారు. ఆనందంగా ఉంటారు. ఇంటి పట్టునే మీరు ఉంటే ఎలా చూడాలో తెలియడం లేదు, మీ బాధను చూడలేకపోతున్నా’ అని అంటుంది. అప్పుడు రామరాజు ‘ఏం చేయమంటావు.. ఒకవైపు అమూల్య బాధ, మరోవైపు సాగర్ ఉద్యోగం కొనుక్కొని పరువు తీసాడనే బాధ, బయటికి ముఖం ఎలా చూపించగలను’ అని చెబుతాడు రామరాజు. వేదవతి ‘ఏ పిల్లలు మాత్రం తప్పు చేయరండి, ఏ తల్లిదండ్రులు మాత్రం బాధపడడం లేదు. మీరు మిల్లుకు వెళ్ళండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది’ అని చెబుతుంది వేదవతి.
ఆ మాటలు వల్లి వెనక నుంచి వింటుంది. వెంటనే తనలో తాను ‘అసలే మా ఆయన అమాయకుడు. తండ్రికి పరమ భక్తుడు. నాన్న రైస్ మిల్లుకు తిరిగి వచ్చేస్తే తాళాలు మళ్లీ ఆయన చేతిలో పెట్టేస్తాడేమో.. అదే జరిగితే మా పెత్తనం ఉండదు’ అంటూ కంగారుగా లంచ్ బాక్స్ పెట్టుకొని రైస్ మిల్లుకు పరుగులు పెడుతుంది.
ఇక్కడి నుంచి సీను నర్మద దగ్గరికి మారుతుంది. ఆఫీసులో నర్మద కొలీగ్స్ రామరాజు ఇంట్లో జరిగిన గొడవల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. సాగర్ ని వాళ్ళ నాన్న కొట్టారంట అని ఒకరు అంటే, లంచం పెట్టుకుంటే కొట్టరా అని మరొకరు అంటారు. భర్తకి గవర్నమెంట్ జాబ్ అని మన ముందు బిల్డప్ కొట్టింది అంటూ నానా రకాలుగా మాట్లాడుతారు. ఇంతలో నర్మద స్నేహితురాలు వచ్చి నర్మద గురించి మనకు తెలియదా? ఆమె భర్త చేస్తే నర్మదను అంటారేంటి అని తిడుతుంది. ఆ తర్వాత నర్మద దగ్గరికి వెళ్లి ధైర్యం చెబుతుంది.
ఇక ధీరజ్ కారు కొనడం కోసం డబ్బులు దొరక్క పోవడంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ వీడిని చూడలేకపోతున్నా ఏదో ఒక మార్గం వెతకాలి వీడి కోసం, ఏదైనా చేయాలి అని ఆలోచిస్తుంది. ధీరజ్ తో ‘తర్వాత టెన్షన్ పడొచ్చు, కానీ ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆపు’ అంటుంది. ఐస్ క్రీములు కొని ధీరజ్ కు తినిపించేందుకు ప్రయత్నిస్తుంది. కాసేపటికి ధీరజ్ నవ్వుతాడు. అప్పుడు ప్రేమ నువ్వు నవ్వితే హాయిగా ఉంది అని అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది