
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో కార్తీక్, దీప ఇంకా పనిలోకి రాలేదని కోపంగా బయటకు వచ్చి చూస్తుంది పారు. ఏమైంది ఎవ్వరి కోసం చూస్తున్నావు అంటాడు శివన్నారాయణ. పనివాళ్లు ఇంకా పనిలోకి రాలేదు అంటుంది పారు. దీప కడుపుతో ఉంది. వట్టి మనిషి కాదు. రాకపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది అంటాడు శివన్నారాయణ. కార్తీక్ కి ఫోన్ చేస్తాడు. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడు.
పనివాళ్లకు చనువిస్తే ఇలాగే ఉంటుంది. యజమానుల్లా ఫీల్ అవుతారు అంటుంది పారు. యజమానుల్లా ఫీల్ అవ్వడమే కాదు.. యజమానులు అయిపోతారు కూడా అంటాడు శివన్నారాయణ. ఆ మాటకు సైలెంట్ అవుతుంది పారు. కాంచనకు ఫోన్ చేస్తాడు శివన్నారాయణ. దీప వాళ్లు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. ఇంకా లేవలేదు. దీప రాత్రి కడుపు నొప్పి అని చెప్పింది నాన్న అంటుంది కాంచన. అవునా అని కంగారు పడతాడు శివన్నారాయణ. సరే నువ్వు వాళ్లను లేపకు. నేను వస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దీప ప్రెగ్నెన్సీ పోయినట్లు ఉంది అని మనసులో సంతోషపడుతుంది పారు.
చూడు చెల్లెమ్మ ఇది ఎలా అల్లరి చేస్తుందో అని అంటుంది అనసూయ. ఏమైందే? నీకు ఏం కావాలి అని శౌర్యను అడుగుతుంది కాంచన. చూడు నానమ్మ.. జుట్టు ఎలా వేసిందో? ఇలా వేస్తే నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేయరా? అంటుంది శౌర్య. దాని ఫ్రెండ్స్ స్టైల్ స్టైల్ జడలు వేసుకొస్తున్నారట. ఇది కూడా అలాగే వేయమని అడుగుతుంది చెల్లెమ్మ అంటుంది అనసూయ.
సరే ఇటు రా నేను వేస్తా అని శౌర్యకు జడ వేస్తుంది కాంచన. ఈ రోజుకి ఇలా ఉంచుకో. రేపటి నుంచి స్టైల్ గా వేస్తాను అని చెప్తుంది. దీంతో వేగలేకపోతున్నాను, ఎక్కడైనా వేసేయ్ చెల్లెమ్మ అంటుంది అనసూయ. పారిజాతం మాటలను గుర్తుచేసుకుంటుంది కాంచన. ఏమైంది చెల్లెమ్మ అని అడుగుతుంది అనసూయ. రాత్రి పిన్ని అని చెప్పబోతుండగా పారిజాతం, శివన్నారాయణ, సుమిత్ర, డాక్టర్ వస్తారు.
ఏంటి కాంచన ఇది. పుట్టబోయేది మా అమ్మే అని చెప్పావు. ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటాడు శివన్నారాయణ. దీప దగ్గరికి వెళ్లి చెక్ చేయమని డాక్టర్ తో చెప్తాడు. అప్పటికే పడుకునే ఉంటుంది దీప. సుమిత్ర, డాక్టర్ లను చూసి నాకేం కాలేదమ్మ. ఇప్పుడు బాగానే ఉంది అంటుంది దీప. అసలు ఎందుకు కడుపు నొప్పి వచ్చింది అని అడుగుతుంది డాక్టర్. శౌర్య కాలు తగిలింది అని చెప్తుంది దీప.
దీపను చెక్ చేసి అంతా ఓకే.. బట్ ఇది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకో అని చెప్తుంది డాక్టర్. అంతా బయటకు వస్తారు. ఏమైంది డాక్టర్ దీపకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు శివన్నారాయణ. నిద్రలో శౌర్య కాలు తగిలిందట మామయ్య గారు. ఇప్పుడు ఇబ్బంది లేదు అని చెప్తుంది సుమిత్ర. ఇకపై ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్.
ఇది శౌర్య వల్లే జరిగి ఉంటుందని నేను రాత్రే అనుకున్నాను అని కోపంగా అంటుంది కాంచన. అదేం కావాలని చేయలేదు కదా అమ్మ అంటాడు కార్తీక్. ఎలా చేసినా దీపకు ఏదైనా అయితే ఎలా ఉండేది. ఇకపై మీరు దాన్ని ఆ గదిలో పడుకోబెట్టుకోవద్దు అంటుంది కాంచన. నువ్వు దీపను, తన కడుపులోని బిడ్డను జాగ్రత్తగా చూసుకో. శౌర్యను మేం చూసుకుంటాం లే అని కోపంగా చెప్తుంది. నా మాటలు కాంచనపై పనిచేస్తున్నాయని మనసులో సంతోషపడుతుంది పారు. ఇప్పుడు శౌర్యకు చెప్పేది చెప్పి దాన్ని మార్చేయాలి అని శౌర్యకోసం వెతుక్కుంటూ వెళ్తుంది పారు.
శౌర్య దగ్గరికి వెళ్లి ఇక్కడున్నావా? నువ్వు రాత్రి మీ అమ్మను కడుపులో తన్నావంటా కదా అంటుంది పారు. నేను తన్నలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావని అంటుంది శౌర్య. నువ్వు చిన్న పిల్లవు కదా నీకు తెలియదు లే.. నువ్వు తన్నడం వల్ల మీ అమ్మకు కడుపు నొప్పి వచ్చింది. అందుకే డాక్టర్ వచ్చి మీ అమ్మను చెక్ చేసింది అని చెప్తుంది పారు.
అమ్మకు ఏమైనా అయిందా అంటుంది శౌర్య. ఏం కాలేదు కానీ.. నిన్నే ఈ రోజు నుంచి మీ అమ్మానాన్నల దగ్గర పడుకోనివ్వరు అంటుంది పారు. మీ నానమ్మ దగ్గరే పడుకోమంటారు. మీ నానమ్మకు నువ్వంటే ప్రేమలేదు. మీ అమ్మ కడుపులో ఉన్న బుజ్జి పాప అంటేనే ప్రేమ అంటూ చిన్నగా శౌర్య మనసులో విషం నాటుతుంది పారు.
పోను పోను మీ నాన్న కూడా నిన్ను పట్టించుకోడు. నీ మీద మీ అమ్మానాన్నలకు ప్రేమ తగ్గిపోతుంది. నీకోసం ఏది కొనరు అని చెప్తుంది పారు. నిన్ను ఇంతకు ముందులా చూడాలంటే నువ్వు బాగా అల్లరి చేయాలి. అందరికీ ఎదురు చెప్పాలి. నాకు బేబీ వద్దు అని చెప్పాలని శౌర్యతో చెప్తుంది పారు. ఆలోచనలో పడుతుంది శౌర్య. ఇప్పటి నుంచి నీకు నరకం కనిపిస్తుంది రా కార్తీక్ అని మనసులో అనుకుంటుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.