కొడుకు కోసం రిక్వెస్ట్.. బేబీని ఆడిస్తూ మురిసిపోతున్న ఇలియానా.. క్యూట్ ఫొటోలు

First Published | Oct 9, 2023, 9:17 PM IST

ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల చిన్నారితో కలిసి ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతోంది. తాజాగా క్యూట్ ఫొటోస్ వైరల్ గా మారాయి. 
 

గోవా బ్యూటీ ఇలియానా (Ileana)  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సన్నని నడుముతో టాలీవుడ్ ను షేక్ చేసిన ఇలియానా కొన్నేళ్ల పాటు వరుస చిత్రాలతో అలరించింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. 
 

కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో సందడి చేసింది. అక్కడా తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఇక టాలీవుడ్ కు ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ అప్డేట్స్ ఏమీ రావడం లేదు. 
 


ఇక ఇలియానా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ ఊహించని షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండా తన పెగ్రెన్సీని అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ఆగస్టులో పండంటి మగ బిడ్డకూ జన్మినిచ్చి తల్లిగా మారింది. 
 

ఇక రీసెంట్ గా తన కొడుకుతో కలిసి ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. తాజాగా చిన్నారిని ఆడిస్తూ కొన్ని క్యూట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ నోట్ రాసుకొచ్చింది. 
 

తన కొడుకు ముఖం ఆ బర్డీని చూసినప్పుడు వెలిగిపోతుందని,  తను చాలా నచ్చిందని పేర్కొంది. అలాగే అది చాలా చిన్న పరిమాణంలో ఉందని.. ఆ కంపెనీ పెద్ద పరిమాణంలో కూడా వాటిని తయారు చేయాలని కోరుకుంటున్నానని తెలిపింది. ట్యాగ్ కూడా చేసింది. దీంతో ఇలియానా పోస్ట్ వైరల్ గా మారింది. 
 

ఏదేమైనా ఇలియానా తల్లిగా మురిసిపోతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ఆమె ఈ ఏడాది మేలోనే మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఇంతవరకు అతన్ని ఫ్యాన్స్ కు పరిచయం చేకపోవడం గమనార్హం. ఇక హిందీలో ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’, ‘లవర్స్’ అనే చిత్రాల్లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!