బాలీవుడ్ పై వ్యామోహంతో టాలీవుడ్ చిత్రాలని వదిలేసింది. కానీ బాలీవుడ్ లో ఆమెకి ఏమాత్రం కలసి రాలేదు. పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఇంతలో టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మొత్తం పోయింది. ఆ సమయంలో ఇలియానా పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. ఓ వ్యక్తితో బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది. దీనితో ఆమెకి అవకాశాలు ఇచ్చే నిర్మాతలు కరువయ్యారు. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది కానీ వర్కౌట్ కాలేదు.ఇలియానా తెలుగులో నటించిన చిత్రాల్లో దేవదాసు, పోకిరి, ఆట, జల్సా, కిక్, జులాయి చిత్రాలు విజయం సాధించాయి.