గోవా బ్యూటీ, నడుము సుందరి ఇలియానాకి యువతలో ఉండే క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా.
గోవా బ్యూటీ, నడుము సుందరి ఇలియానాకి యువతలో ఉండే క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి. బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు.
26
Ileana
బాలీవుడ్ లో ఇలియానా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీనితో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండు చోట్లా ఆఫర్స్ కరువయ్యాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. ఇలియానా తరచుగా తన లవ్ బ్రేకప్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది. బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది.
36
Ileana
ఒక దశలో ఇలియానా డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకోవాలని భావించినట్లు కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలియానా సూసైడ్ థాట్స్ గురించి మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇలియానా తన బాడీ షేప్స్ వల్ల బాడీ షేమింగ్ కి గురైందని.. అందువల్లే ఆత్మహత్య చేసుకోవాలనుకుందని ఓ బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై ఇలియానా తాజాగా ఇంటర్వ్యూలో స్పందించింది.
46
Ileana DCruz
తాను సూసైడ్ చేసుకోవాలని భావించిన సంగతి నిజమే. కానీ అది నా బాడీ షేప్స్, బాడీ షేమింగ్ వల్ల మాత్రం కాదు. కొన్ని ఊహించని పరిస్థితుల వల్ల డిప్రెషన్ లోకి వెళ్లా. దీనితో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా పుట్టాయి. కానీ మీడియాలో నా శరీరాకృతి వల్ల ఆత్మహత్య ఆలోచన చేసినట్లు రాశారు. అది చాలా బాధించింది.
56
Ileana
12 ఏళ్ల వయసు లోనే నేను శరీరాకృతి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కాబట్టి అప్పటి నుంచే నా బాడీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. కానీ ఎప్పుడూ ఆ అంశం వల్ల చనిపోవాలని అనుకోలేదు. కానీ నాపై రాసిన ఆర్టికల్స్ వల్ల నా స్నేహితులు సందేశాలు పంపారు. అది నాకు చాలా చిరాకుగా అనిపించినట్లు ఇలియానా పేర్కొంది.
66
దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. పోకిరితో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది.