పైలట్‌తో ఘాటు ప్రేమలో మునిగితేలుతున్న `లాకప్` బ్యూటీ.. ఫోటోలే సాక్ష్యం..హాట్‌ టాపిక్‌

Published : Jul 14, 2022, 08:48 PM IST

ఇటీవల హిందీలో పాపులర్‌ అయిన షో `లాకప్‌` లో పాల్గొని పాపులారిటీని సొంతం చేసుకుంది సారా ఖాన్‌. ఈ అమ్మడు ఘాటు ప్రేమలో మునిగి తేలుతుండటం విశేషం. తాజాగా ఆ విషయం నెట్టింట వైరల్‌ అవుతుంది.

PREV
16
పైలట్‌తో ఘాటు ప్రేమలో మునిగితేలుతున్న `లాకప్` బ్యూటీ.. ఫోటోలే సాక్ష్యం..హాట్‌ టాపిక్‌

టీవీ, సినీ రంగంలో ఉండే నటీనటులు ప్రేమలో పడటం కామన్‌. కానీ సినీ రంగానికి సంబంధం లేని వారితో ప్రేమలో పడటమే సరికొత్తగా ఉంటుంది. ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల హిందీ పాపులర్ షో `లాకప్‌`(Lock Upp) ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సారా ఖాన్‌(Sara Khan) సైతం ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతుంది. ఆమె ప్రేమ విషయం బయటకు పొక్కడమే అందుకు కారణం. 
 

26

భోపాల్‌కి చెందిన సారా ఖాన్‌ మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. మిస్‌ భోపాల్‌ టైటిల్‌ విన్నర్ గా నిలిచింది. అట్నుంచి అనేక సీరియల్స్ లో నటించింది. పదుల సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకి బాలీవుడ్‌లోనూ సినిమా ఆఫర్లు వచ్చాయి. టీవీ, సినిమాలతో ఫుల్‌ బిజీ అయ్యిందీ భామ. 2007 నటిగా రాణిస్తుంది. 
 

36

2013లో `డార్క్ రైన్‌బో` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆశించిన ఆఫర్లు రాలేదు. ఆ తర్వత 2014లో `ఎం3ఃమిడ్‌సమ్మర్‌ మిడ్‌నైట్‌ ముంబయి`, `తుజ్‌ సే హీ రాబ్తా`, `హమారి అధూరి కహానీ` చిత్రాల్లో నటించింది. కానీ  పెద్దగా గుర్తింపురాలేదు. దీంతో టీవీనే నమ్ముకుంది సారా ఖాన్. 
 

46

హిందీలో `బిగ్‌ బాస్‌ 4`లో పాల్గొని పాపులారిటీని సొంతం చేసుకుంది. హిందీలో సీరియల్స్, షోస్‌ చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో కంగనా రనౌత్‌ హోస్ట్ గా చేసిన `లాకప్‌` షోలో పాల్గొంది. ఇందులో ఉన్నన్ని రోజులు తనదైన స్టయిల్లో ఎంటర్‌టైన్‌ చేసింది. హాట్‌ టాపిక్‌ అయ్యింది. `లాకప్‌` షోలో సారాకి శివం శర్మ లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. కానీ ఆమె అతన్ని ప్రేమని తిరస్కరించింది. దీంతో ఆమె అప్పటికే ప్రేమలో మునిగిపోవడంతో శివం శర్మ ప్రేమని తిరస్కరించిందని అంటున్నారు. 
 

56

తాజాగా భామ ప్రేమలో మునిగి తేలుతుందనే విషయం బయటకు వచ్చింది. ఓ పైలట్‌ ప్రేమలో పడినట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు సైతం ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. థానేకి చెందిన పైలట్‌ శాంతను రాజే(Shantanu Raje)తో ఆమె డేటింగ్‌ చేస్తుందట. సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని తెలుస్తుంది. 
 

66

ఇటీవల ఈద్‌ పండుగ సందర్భంగా ఇద్దరు కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.తాజాగా వీరిద్దరు కలిసి మోహిత్‌ చౌహాన్‌ పాడిన మ్యూజిక్‌ ఆల్బమ్‌లో కలిసి నటించడం విశేషం. ఈ విషయాన్ని శాంతను వెల్లడించారు. దీంతో అసలు మ్యాటర్‌ బయటపడింది. ఈ జంట కొన్ని నెలలుగా ప్రేమలో మునిగి తేలుతున్నారని వారు పంచుకునే ఫోటోలను బట్టి అర్థమవుతుంది. అయితే త్వరలోనే ఈ జంట తమ ప్రేమని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories