ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలో యాంకర్‌ రష్మి రచ్చ.. `జబర్దస్త్` భామ ఇలాంటి పనులు కూడా చేస్తుందా?

First Published | Aug 29, 2022, 7:24 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి షోలో చేసే రచ్చే ఇప్పటి వరకు చూశారు. ఆమెలోని మరో యాంగిల్‌ బయటకొచ్చింది. ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్‌ కూడా చేస్తుంది. అంతేకాదు అంతకు మించి ఎంటర్‌టైన్‌ అవుతుంది. 

హాట్‌ యాంకర్‌ రష్మి(Rashmi Gautam) ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు షోస్‌ చేస్తుంది. ఫుల్‌ బిజీగా ఉంది. వరుసగా వారానికి ఆమె మూడు షోలతో ఎంటర్‌టైన్‌  చేస్తుంది. `జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లతో సందడి చేస్తుంది. ఈ మూడు షోలు ఆద్యంతం వినోదాన్ని పంచుతూ రష్మి క్రేజ్‌ని మరింత పెంచుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా రష్మి(Anchor Rashmi) రచ్చ చేసింది. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటూ నానా హంగామా చేసింది. సైలెంట్‌ గా తన ఫ్రెండ్స్ తో పెగ్గేస్తూ కనిపించింది యాంకర్‌ రష్మి. సండే రాత్రి రష్మి ఇలా ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుందని తెలుస్తుంది. తాజాగా ఆ ఫోటోలను పంచుకుంది. ఇన్‌ స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో వాటిని షేర్‌ చేసింది. జ్యూసా? లేక ఆల్కాహాలా? అనేది తెలియాల్సి ఉంది. 
 


మొత్తంగా హాట్‌యాంకర్‌ తన పార్టీ ఫోటోలను రచ్చ చేస్తుందని చెప్పొచ్చు. వీటిపై నెటిజన్లు స్పందిస్తూ షాకింగ్‌ పోస్టులు పెడుతున్నారు. రష్మి పెగ్గేస్తూ నాన్‌ స్టాప్‌ రచ్చ అంటూ, రష్మి ఇలాంటి పార్టీలు కూడా చేసుకుంటుందా? రష్మి లోని మరో యాంగిల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 
 

యాంకర్‌ రష్మి గౌతమ్‌ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనగురించి ఎవరేమనుకున్నా పట్టించుకోదు, తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్తుంది. తనని ఏమైనా పట్టించుకోదుగానీ, డాగ్స్ ని ఏమన్నంటే మాత్రం ఊరుకోదు. తనలోని చంద్రముఖి బయటకు వస్తుందని ఇటీవల నెటిజన్లు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. 
 

Rashmi Gautam

తాజాగా డాగ్స్ పై ఓ దుండగుడు చేసిన యాసిడ్‌ దాడిపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్‌ చేస్తుంది. మార్నింగ్‌ నుంచి ట్విట్టర్‌లో రచ్చ చేసిన విషయం తెలిసిందే. వరుస పోస్ట్ లతో పీఎంకి సైతం ట్యాగ్‌ చేస్తూ హంగామా చేసింది. 
 

ఇక హాట్‌ ఫోటో షూట్లతో సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుంది రష్మి గౌతమ్‌. తన హాట్‌ అందాలను ట్రెండీ డ్రెస్సుల్లో బంధిస్తూ సందడి చేస్తుంది. సెక్సీ అందాలను చీరలో చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. సోషల్‌ మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

Latest Videos

click me!