రవితేజ సరసన ఖతర్నాక్ సినిమాలో ఇలియానా నటించింది. ఈ సినిమాకి ఇలియానా కోటి రూపాయలు తీసుకుందని సమాచారం. అప్పట్లో ఒక హీరోయిన్ కి కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వడం అదే మొదటిసారి. దీంతో ఇలియానా, ఖతర్నాక్ సినిమా అప్పట్లో చర్చగా మారింది. కానీ ఖతర్నాక్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతరువాత హిట్లు పడటంతో ఆమె కోటిన్నర వరకూ రేటు పెంచిందని కూడా టాక్.