హాట్ అలెర్ట్.. బ్రాలో ఇలియానా అందాల విందు, పార్టీలో మెరిసిన హాట్ బ్యూటీ

First Published | Nov 18, 2021, 11:54 AM IST

గోవా బ్యూటీ ఇలియానా ఘాటు సొగసుతో దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా.

గోవా బ్యూటీ ఇలియానా ఘాటు సొగసుతో దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి. బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. 

ప్రస్తుతం Ileana D'Cruz అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటి ప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఇలియానా, విద్యాబాలన్, నటుడు సెంథిల్ రామమూర్తి కలసి ఓ రొమాంటిక్ కామెడీ మూవీలో నటిస్తున్నారు. 


తాజాగా చిత్ర యూనిట్ లాస్ట్ నైట్ డిన్నర్ పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి ఇలియానా,Vidya balan, సెంథిల్ తో పాటు ఇతర చిత్ర యూనిట్ కూడా హాజరైంది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రెండీ బ్లాక్ డ్రెస్ లో ఇలియానా గ్లామర్ లుక్ లో కనిపిస్తోంది. తాను ధరించిన టాప్ ని పూర్తిగా ఓపెన్ చేసిన ఇలియానా.. బ్రాలో క్లీవేజ్ అందాలతో హాట్ హాట్ గా కనువిందు చేస్తోంది. ఈ ఫోటోస్ లో విద్యా బాలన్ కూడా గ్లామర్ లుక్ లో మెరిసింది. 

గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉంటుంది. 

మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగి ఉండడం నిజంగా భయాన్ని కలిగించే అంశం. ఆ సమయంలో ఎవరినీ దగ్గరకు రానీయరు. ద్వేషించడం మొదలుపెడతారు. అసలు ఎందుకు అలా ఉన్నారో మీకే అర్థం కాదు. ఈ అంశాలు బతికుండగానే మిమ్మల్ని తినేస్తాయి అంటూ ఇలియానా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పెర్కొంది.  

డిప్రెషన్ నుంచి బయట పడ్డ ఇలియానా మళ్ళీ అలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందో తెలియడం లేదు. ఇలియానా చివరగా టాలీవుడ్ లో నటించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ఈ చిత్రం తర్వాత ఇలియానా సౌత్ లో కనిపించలేదు. ప్రస్తుతం ఇలియానా హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. పోకిరితో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. Also Read: Shyam Singha Roy Teaser: స్త్రీ ఎవడికి దాసి కాదు, ఆఖరికి దేవుడికి కూడా..మీసం తిప్పిన నాని

Latest Videos

click me!