Ilaiyaraaja: రజనీకాంత్‌ కోసం భాగ్యరాజ్‌ కి హ్యాండిచ్చిన ఇళయరాజా.. స్టార్‌ డైరెక్టర్‌ ఏం చేశాడంటే?

Published : Mar 21, 2026, 05:55 PM IST

Ilaiyaraaja: మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా.. దర్శకుడు భాగ్యరాజ్ సినిమా కోసం కంపోజ్ చేసిన రెండు పాటలను, సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాకు ఇచ్చేశారు. అసలేం జరిగింది? ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేది చూస్తే 

PREV
14
భాగ్యరాజ్‌ కోసం మ్యూజిక్‌ కంపోజ్‌ చేసిన ఇళయరాజా

డైరెక్టర్ భాగ్యరాజ్ తీసిన 'రాసుకుట్టి' సినిమా కంపోజింగ్ కోసం ఇళయరాజాని పొల్లాచ్చికి తీసుకెళ్లారు. అక్కడ ఓ తోటలో కూర్చుని ఇళయరాజా ఆ సినిమా కోసం పాటలు కంపోజ్ చేశారు. అప్పుడు భాగ్యరాజ్ అడిగిన పాటలతో పాటు అదనంగా మరో రెండు ట్యూన్స్‌ను కూడా కంపోజ్ చేశారట. ఆ రెండు ట్యూన్స్ భాగ్యరాజ్‌కు బాగా నచ్చడంతో, వాటిని తన తర్వాతి సినిమాలో వాడుకుందామని అనుకున్నారు.

24
భాగ్యరాజ్‌ కోసం కంపోజ్‌ చేసిన పాటలు రజనీకాంత్‌కి

ఇళయరాజా కూడా సరే అన్నారు. ఆ రెండు పాటలే ఆ తర్వాత 'ఒరు నాళుమ్ ఉనై మరవాద', 'నిలవే ముగం కాట్టు'గా `యజమాన్` మూవీ ద్వారా తెరపైకి వచ్చాయి. భాగ్యరాజ్ కోసం కంపోజ్ చేసిన పాటలు రజనీ సినిమాలో ఉండటమేంటి అని ఆలోచిస్తున్నారా? అక్కడే ఇళయరాజా ఓ పనిచేశారు. ఒకరోజు భాగ్యరాజ్ ఏవీఎం స్టూడియోకి వెళ్లగా, ఓ గదిలో 'ఒరు నాళుమ్ ఉనై మరవాద' పాట వినిపించింది. ఇది మన పాటే కదా అని భాగ్యరాజ్ షాక్ అయ్యారట.

34
రజనీకాంత్‌ మూవీకి ఆ పాటలు ఇచ్చిన ఇళయరాజా
తన కోసం కంపోజ్ చేసిన పాట ఇక్కడెలా ప్లే అవుతోందని కంగారుగా లోపలికి వెళ్లి చూశారు భాగ్యరాజ్. అక్కడ ఆర్వీ ఉదయకుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న 'యజమాన్' సినిమా పాటల రికార్డింగ్ వేగంగా జరుగుతోంది. ఇది చూసిన భాగ్యరాజ్, ఆర్వీ ఉదయకుమార్‌ దగ్గరికి వెళ్లి 'ఇది నా సినిమా కోసం కంపోజ్ చేసిన పాట కదా, మీరెలా రికార్డ్ చేస్తున్నారు?' అని అడిగారు. దానికి ఆయన ఏదో సమాధానం చెప్పి దాటవేశారు. అప్పుడే తన పాటను ఇళయరాజా 'యజమాన్' సినిమాకు ఇచ్చారని భాగ్యరాజ్‌కు అర్థమైంది.
44
ఇళయరాజాకి ఎదురించని భాగ్యరాజ్‌
తన కోసం సిద్ధం చేసిన పాటలు మరో సినిమాకు వెళ్లినా, ఇళయరాజా మీద, ఆయన సంగీతం మీద ఉన్న గౌరవంతో భాగ్యరాజ్ ఆ విషయాన్ని పెద్దది చేయలేదు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆయన పంచుకున్నారు. ఆ తర్వాత భాగ్యరాజ్ కూడా 'ఇదు నమ్మ ఆళు', 'ఆరారో ఆరిరారో', 'పొన్ను పాక్క పోరేన్', 'పవును పవునుదాన్', 'జ్ఞానపళం' వంటి చిత్రాలకు స్వయంగా సంగీత దర్శకుడిగా పనిచేశారు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories