ప్రభాస్‌ మరో `బాహుబలి` చేస్తాడనుకుంటే, `కొచ్చడయాన్‌` చేశాడేంటి?.. `ఆదిపురుష్‌`పై షాకింగ్‌ ట్రోల్స్..

Published : Oct 02, 2022, 09:17 PM IST

ప్రభాస్‌ `బాహుబలి` తర్వాత ఆ స్థాయి  సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. `ఆదిపురుష్‌`తో ఆ కోరిక నెరవేరబోతుందని అంతా అనుకుంటున్నారు. కానీ టీజర్‌ షాకిస్తుంది. అది దారుణమైన ట్రోల్స్ కి గురవుతుంది.   

PREV
18
ప్రభాస్‌ మరో `బాహుబలి` చేస్తాడనుకుంటే, `కొచ్చడయాన్‌` చేశాడేంటి?.. `ఆదిపురుష్‌`పై షాకింగ్‌ ట్రోల్స్..

డార్లింగ్‌ ప్రభాస్‌ నుంచి వస్తోన్న పాన్‌ ఇండియా, ప్రతిష్టాత్మక మూవీ `ఆదిపురుష్‌`. ఓ రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో రాముడిగా ప్రభాస్‌, జానకిగా కృతి సనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ నేడు సాయంత్రం అయోధ్యంలో భారీగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో విడుదల చేశారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్‌ చేశారు. 
 

28

`ఆదిపురుష్‌` టీజర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. అభిమానులు హోరెత్తించారు. కానీ అంతలోనే ఉసూరుమనిపించారు టీమ్‌. టీజర్‌తో పూర్తి డిజప్పాయింట్‌ చేశారు. ప్రభాస్‌తో కర్టూన్‌ సినిమా చేశారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రభాస్‌ `ఆదిపురుష్‌`తో మరో `బాహుబలి` లాంటి సినిమా చేస్తాడనుకుంటే, `కొచ్చడయాన్‌` చేశాడేంటి? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. 
 

38

అంతేకాదు `ఆదిపురుష్‌1 కర్టూన్‌ సినిమాలా, యానిమేషన్‌ ఫిల్మ్ లా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో చేస్తున్న సినిమా అన్నారు. ఆ డబ్బు అంతా  ఎక్కడ ఖర్చు చేశారు. వీఎఫ్‌ఎక్స్ ఇంత దారుణంగా ఉన్నాయేంటి?ఇదొక స్పై కిడ్స్ 3డీ ఫిల్మ్ లాగా ఉందని, ఈ దెబ్బకి `బ్రహ్మాస్త్ర` బెటర్‌ అని అంటున్నారు. 

48

`ఆదిపురుష్‌` చూశాక.. కార్టూన్‌ నెట్‌వర్క్ ఈ సినిమా డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్ కోసం పోటీపడతాయని, కర్టూన్‌ సినిమాల మధ్య తీవ్ర పోటీ అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కార్టూన్‌ సినిమాల విజువల్స్ తో జోడిస్తూ ఆడుకుంటున్నారు. ప్రభాస్‌ అభిమానులుగా ఎంతో ఆశించామని, ఆయన పాన్‌ ఇండియా రేంజ్‌ పెంచే నటుడవుతాడనుకున్నాం. కానీ చిన్ననాటి కార్టూన్‌ సినిమాని చూపిస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. `బాల్‌ వీర్‌` టెలివిజన్‌ సిరీస్‌కిది  కొత్త వెర్షన్‌లా ఉందంటున్నారు. 
 

58

సినిమాలో ప్రధానంగా విజువల్‌ ఎఫెక్ట్స్ అస్సలు సెట్‌ కాలేదని, చాలా తేలిపోయినట్టు ఉన్నాయని అంటున్నారు. రజనీకాంత్‌ నటించిన `కొచ్చడయాన్‌` సినిమాని జస్ట్ రజనీ బాడీని ఉపయోగించి సినిమాని తీశారు. అది పూర్తిగా నిరాశ పరిచింది. ఇప్పుడు `ఆదిపురుష్‌` సేమ్‌ అలానే ఉందంటున్నారు. ప్రభాస్‌ లోపల ఉండే  సన్నివేశాల వరకు బాగున్నాయని, ఆ తర్వాత బయటకు వచ్చిన సీన్లలో పూర్తిగా సహజత్వం కోల్పోయిందని నిరాశ చెందుతున్నారు డార్లింగ్‌ ఫ్యాన్స్. 
 

68

మరోవైపు సైఫ్‌ అలీ ఖాన్‌ పాత్ర `అల్లాదిన్‌` పాత్రని పోలి ఉందని, అలాగే లక్ష్మణుడు, హనుమాన్‌ పాత్రలకు ఎలాంటి ప్రయారిటీ లేదు. ప్రభాస్‌ని ప్రధానంగా చూపించారు. రాముడిగా ఆయన్ని కొత్తగా ప్రజెంట్‌ చేసే ప్రయత్నం చేశారు. కానీ దానికి విజువల్‌ ఎఫెక్ట్స్ తోడు కావడంతో ఆ సహజత్వం మిస్‌ అయ్యిందని, యానిమేషన్‌ పాత్రలుగా మారిపోయిందని అంటున్నారు. అయితే సీతగా కృతి సనన్‌ పాత్ర ఫర్వాలేదని, మిగిలిన అన్ని పాత్రలు, సీన్లు నేచురాలిటీ మిస్‌ అయ్యిందని కామెంట్‌ చేస్తున్నారు. మరోవైపు వానర సేన విజువల్‌ ఎఫెక్ట్స్ కూడా  క్వాలిటీగా లేవని, ఏమాత్రం సహజంగా అనిపించడం లేదని చెబుతున్నారు. 

78

విజువల్‌ గ్రాండియర్‌గా ఈ సినిమాని తెరకెక్కించారని అర్థమవుతుంది. టీజర్‌ చివర్లో వచ్చే బీజీఎం గూస్‌బంమ్స్ తెప్పించింది. కొన్ని సీన్లు వండర్‌ఫుల్‌గా ఉన్నాయి. కానీ అన్ని అలా లేకపోవడంతో అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారని చెప్పొచ్చు. అయితే టీజర్‌తో సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేసింది `ఆదిపురుష్‌` టీమ్‌. అయోధ్యలో భారీ ఈవెంట్‌గా ఈ టీజర్‌ని విడుదల చేయడంతో దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తుంది. భారీగా ఆదరణ దక్కుతుంది. 
 

88

మరోవైపు టీజర్‌ని బట్టి సినిమాని డిసైడ్‌ చేయలేము. ట్రైలర్‌, సినిమాలో అద్భుతాలు  జరిగే అవకాశం ఉంది. అలాంటి ఆశతో ఉన్నారు అభిమానులు. అందుకే తక్కువ అంచనా వేయోద్దని, అసలు ప్రభంజనం మున్ముందు ఉందని చెబుతున్నారు. మరోవైపు `తానాజీ` వంటి జాతీయ అవార్డు చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించిన సినిమా కావడంతో ఏమాత్రం  తగ్గదని, దాని రేంజ్‌ వేరే లెవల్‌లో ఉంటుందని భరోసా ఇస్తున్నారు కొందరు అభిమానులు. ఈ సినిమాని జనవరి 12న విడుదల చేయబోతున్నారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories