Ram Charan Net Worth : రామ్ చరణ్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే.. మతిపోయే వ్యాపారాలు కూడా..

Published : Mar 27, 2022, 01:26 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటు యాక్టర్ గానే కాకుండా పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. ఇప్పటి వరకు తనకున్న మొత్తం ఆస్తి విలువ తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. 

PREV
18
Ram Charan Net Worth : రామ్ చరణ్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే.. మతిపోయే వ్యాపారాలు కూడా..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడు, రామ్ చరణ్ ఖచ్చితంగా సౌత్‌లోని బిగ్గెస్ట్ స్టార్‌లలో ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  ఆర్ఆర్ఆర్ RRR మూవీతో రామ్ చరణ్ తారా స్థాయికి  చేరుకున్నాడు. అయితే చరణ్ విలాసవంతమైన జీవనశైలి, అతని స్థిరాస్థి విలువ షాక్ కు గురిచేస్తోంది. 

28

ఇప్పటికే రామ్ చరణ్ ఒక్కో సినిమాకు  భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆర్ఆర్ఆర్ ఒక్క మూవీకే చరణ్ రూ.40 కోట్లకు పైగా ఛార్జీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు తన అప్ కమింగ్ ఫిల్మ్ ఆర్సీ 15 (RC 15), ఆర్సీ 16కు కూడా హై రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడంట.  ఈ రెండు చిత్రాల తర్వాత చరణ్ రూ.100 కోట్ల జాబితాలోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

38

చరణ్ కేవలం నటుడే కాదు.. వ్యాపార వేత్త కూడా. రామ్ చరణ్ కు రూ. 1,300 కోట్ల నికర విలువలో ఓ  ప్రయివేట్ ఎయిర్‌లైన్ కంపెనీ మరియు పోలో క్లబ్ ను కలిగి ఉన్నట్టు సమాచారం. దేశం నలుమూలలా ప్రయాణించే ‘ట్రూజెట్’ అనే ప్రైవేట్ ఎయిర్‌లైన్ కంపెనీని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా తన భార్య ఉపాసన కొణిదెల (Upasana)తో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు, ప్రచార కార్యక్రమాల కోసం తరచుగా వినియోగించేందుకు ఓప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. 

48

అలాగే రామ్ చరణ్ హైదరాబాద్ పోలో  క్లబ్ యజమాని కూడా.. ‘రామ్ చరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్’ పేరుతో చరణ్ మగధీర సక్సెస్ తర్వాత తనకంటూ ఓ పోలో టీమ్ కొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ పోలో టీమ్ కోసం దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పోలో క్లబ్ లో భాగస్వామిగా ఉన్నట్టు గా తెలుస్తోంది.
 

58

పోలో క్లబ్ తో పాటు రామ్ చరణ్ లగ్జరీ కార్లను కూడా సొంతం చేసుకున్నాడు. ఆస్టన్ మార్టిన్ V8 వాంటేజ్ నుండి రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్, BMW M7, Mercedez Benz g62 AMG లాంటి కార్లను తన గ్యారేజ్ లోకి షిప్ట్ చేశాడు. వీటిలోని ఒక్కో కారు విలువ దాదాపుగా రూ. కోట్లలో నడుస్తుంది.

68

చెర్రీకి వాచీల పట్ల మక్కువ ఎక్కువ. తనకు నచ్చిన ప్రతి గడియారాన్ని కొనడానికి ఇష్టపడతాడు. ఇప్పటి  వరకు చరణ్ కు  30 అత్యంత ఖరీదైన గడియారాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పటేక్ ఫిలిప్ నాటిలస్ వాచ్‌ని ధరించాడు. దీని విలువ సుమారు రూ. 80 లక్షలుగా ఉంటుంది. 
 

78

ప్రస్తుతం రామ్ చరణ్ హైదరాబాద్‌లోని తన తండ్రితోనే విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నాడు. చిరంజీవి ఇల్లు హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ఆస్తులలో ఒకటిగా చెప్పొచ్చు. రెండేండ్ల కింద దాదాపు రూ. 40 కోట్లతో అన్ని ఆధునిక సౌకర్యాలు మరియు టాప్ ఇంటీరియర్స్ తో రాజభవనం లాంటి ఇల్లును నిర్మించారు. 

88

ఇక రామ్ చరణ్ ఇటీవల SS రాజమౌళి తెరకెక్కించిన  RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌ (NTR)తో కలిసి నటించారు. ఈ చిత్రం నేషనల్, ఇంటర్నేషనల్ రేంజ్ లో ఫ్యాన్స్ ఆదరణ పొందుతుండటం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు గర్వకారణం. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ రెండింతలు పెరిగింది. 

click me!

Recommended Stories