ఈసారి హిట్ పడకపోతే ఈ స్టార్ హీరోల పరిస్థితి ఏంటి? ఫ్యాన్స్ లోనూ నెలకొన్న ఆందోళన..

First Published Jun 26, 2022, 6:06 PM IST

సౌత్ స్టార్ హీరోలు ప్రభాస్, చిరంజీవి, విజయ్ లకు ‘హిట్’ భయం పట్టుకుంది. చివరిగా  తాము నటించిన చిత్రాలు థియేటర్లలోకి వచ్చి అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు. 
 

సౌత్ సినిమాలంటే ప్రస్తుతం దేశమంతటా మంచి క్రేజ్ ఉంది.  బహుబలి, పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల తర్వాత సౌత్ స్టార్స్ కూడా పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా తెలుగు నుంచి వచ్చే సినిమాలపై నార్త్ ఆడియెన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

కాగా, సౌత్ స్టార్ హీరోల్లో ముఖ్యంగా ప్రభాస్, చిరంజీవి, విజయ్  వారి  ఫ్యాన్స్ ను ఇటీవల విడుదలైన చిత్రాలు నిరాశపరిచాయి. రిలీజ్ కు ముందు భారీ హైప్ తో వచ్చినా.. థియేటర్లలో మాత్రం ఆడియెన్స్ తో విజిల్స్ వేయించలేకపోయాయి. ఈ ఏడాది ఈ హీరోలకు నెగెటివ్ రిజల్ట్స్ రావడంతో.. తదుపరి విడుదల కానున్న సినిమాలపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇవి హిట్ కాకపోతే వీరి పరిస్థితి అయోమయంలో పడనున్నదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
 

ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ -రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన  ‘బహుబలి’ (Baahubali) తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచం నలుదిశలా వ్యాపించింది. ఒక్కసారిగా ప్రభాస్  రేంజ్ కూడా మారిపోయింది. పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు. 

అయితే ‘బహుబలి’ తర్వాత అంతటి సక్సెస్ ను చూడటం ప్రభాస్ కు కష్టమౌతోంది. చివరిగా వచ్చిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్నా.. వండర్ ఫుల్ విజువల్స్ ను అందించినా ఆడియెన్స్ ను మాత్రం ఫిదా చేయలేకపోయాయి. ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’పై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ‘ఆది పురుష్’ జనవరి 12న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హిట్ కాకపోతే ప్రభాస్ కు కొంత మేర డ్యామేజ్ జరిగే అవకాశం ఉందంటున్నారు.
 

ఇక  మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులు కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. చిరు కమ్ బ్యాక్ ఇచ్చినప్పటి నుంచి ఆయన క్రేజ్, గ్రేస్ కు తగ్గా సాలిడ్ హిట్ మాత్రం పడలేదనే చెప్పాలి. చివరిగా వచ్చిన ‘ఆచార్య’ కూడా బెడిసికొట్టడంతో తదుపరి చిత్రం ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’పైనే ఆశలు పెట్టుకున్నారు. అలాగే మెగా 154 వచ్చే ఏడాది జనవరి 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రం కూడా అంతంతే ఆడితే పరిస్థితులు మారే అవకాశం ఉందంటున్నారు. 

తమిళ స్టార్ విజయ్ (Vijay)కి కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ‘అదిరింది, మెరిసె, మాస్టర్’తో ఆడియెన్స్ కు చాలా దగ్గరయ్యాడు. ఈయన కూడా చివరిగా ‘బీస్ట్’తో వచ్చి కాస్తా బోల్తా కొట్టాడు. టాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్ తో డైరెక్ట్ గా తెలుగులో ‘వారసుడు’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతోనైనా బ్లాక్ బాస్టర్ కొడితేనే విజయ్ ఇమేజ్ కు ఎలాంటి డ్యామేజ్ ఉండదు. లేదంటే ఊహించని పరిణామాలు తప్పవంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు. 
 

click me!