Pragya Jaiswal: కారు మేఘాల్లో ప్రగ్యా జైస్వాల్ అందాలు.. నడుము సొగసు చూపిస్తూ చిల్ అవుతున్న బ్యూటీ

First Published Jun 26, 2022, 4:58 PM IST

గ్లామర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. 

గ్లామర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. 

కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాలు ఆరబోస్తోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 

బోయపాటి దర్శకత్వంలో Balakrishna సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన Pragya Jaiswal ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. 

మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ యూరప్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రకృతి అందాలని, చారిత్రాత్మక కట్టడాలని సందర్శిస్తోంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ మెస్మరైజ్ చేసేలా రెడ్ డ్రెస్ లో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. 

తాజాగా ప్రగ్యా జైశ్వాల్ బ్రేక్ ఫాస్ట్ సందర్భంగా టెర్రస్ పై కూర్చుని చిల్ అవుతోంది. కారు మబ్బులు ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్లు ఉన్నాయి. వాటితో పోటీ పడుతోందా అన్నట్లుగా ప్రగ్యా గ్లామర్ ఒలకబోస్తోంది. 

సింపుల్ గా ఉన్న డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ నడుము మడతలు చూపిస్తూ చిరునవ్వుతో చిచ్చు రేపుతోంది. ప్రగ్యా అందాలకు నెటిజన్లు మెస్మరైజ్ అవుతున్నారు. 

click me!