నమ్రత అసలు డ్రీమ్‌ ఏంటో తెలుసా? అదే జరిగి ఉంటే మహేష్‌బాబు ఎప్పటికీ దొరికేవాడు కాదేమో

Published : Aug 05, 2025, 05:09 PM IST

నమ్రత శిరోద్కర్‌ మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చింది. కానీ ఆమె అసలు డ్రీమ్‌ వేరే ఉంది. అదే జరిగి ఉంటే ఇప్పుడు ఆమె లైఫ్‌లో మహేష్‌ బాబు ఉండేవాడు కాదు. 

PREV
15
`వంశీ` సినిమాతో ప్రేమలో పడ్డ మహేష్‌ బాబు, నమ్రత

మహేష్‌ బాబు, నమ్రత శిరోద్కర్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. `వంశీ` సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి వరకు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న నమ్రత.. `వంశీ` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బి గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2000లో విడుదలైంది. బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. కానీ ఈ చిత్రం రెండు మనసులను కలిపింది. హీరో హీరోయిన్లని ఓ ఇంటివారిని చేసింది. అలా `వంశీ` మూవీ మహేష్‌ బాబు, నమ్రత జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోతుందని చెప్పొచ్చు.

DID YOU KNOW ?
మిస్‌ ఇండియా విజేత
నమ్రత శిరోద్కర్‌ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌ చేసింది. 1993లో మిస్‌ ఇండియా విజేతగా నిలిచింది.
25
మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన నమ్రత

అయితే నమ్రత సినిమాల్లోకి ఎంట్రీకి ముందు మోడలింగ్‌ చేసింది. కాలేజీ రోజుల్లోనే ఆమె మోడలింగ్ చేసి ఏకంగా 1993లో మిస్‌ ఇండియా విజేతగా నిలిచింది. అలాగే మిస్‌ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది. మొదట `జబ్‌ ప్యార్‌ కిసిసే హోతా హై` చిత్రంతో నటిగా మారింది. ఇందులో ఓ కీ రోల్‌ చేసింది. `మేరే దో అన్మోల్‌ రతన్‌` సినిమాతో హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. ఆ తర్వాత వరుసగా మూవీలో నటిస్తూ స్టార్‌ గా ఎదిగింది. అప్పట్లో నమ్రత బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఈ క్రమంలోనే ఆమెకి తెలుగులో `వంశీ`లో నటించే ఛాన్స్ వచ్చింది.

35
నమ్రత డ్రీమ్‌ ఇదే

అయితే నమ్రత అసలు డ్రీమ్‌ సినిమా కాదు. ఆమె ఎయిర్‌ హోస్టెస్‌ కావాలనుకుంది. ఆ దిశగానే ప్రయత్నాలు చేసిందట. కానీ వాళ్ల అమ్మ బెదిరించిందట. అప్పట్లో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. దీంతో ఆ ఫీల్డ్ వద్దు, దాన్ని విరమించుకో అని హెచ్చరించిందట నమ్రత అమ్మ. అప్పటికీ తాను సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో నమ్రత లేదు. దీంతో చేసేదేం లేక తనడ్రీమ్‌ ని పక్కన పెట్టింది. ఈ విషయాన్ని నమ్రత గతంలో సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

45
నమ్రత డ్రీమ్‌ నెరవేరితే మహేష్‌ దొరికేవాడు కాదు

మొత్తంగా అమ్మ వల్ల తన ఇష్టాన్నే వదులుకుంది నమ్రత. ఆ తర్వాత మోడలింగ్‌లోకి వచ్చి, హీరోయిన్‌గా మారి, స్టార్‌ హీరోయిన్ గా అలరించిన విషయం తెలిసిందే. అయితే ఒకవేళ నమ్రత వాళ్ల అమ్మ తన డ్రీమ్‌కి ప్రయారిటీ ఇచ్చి ఉంటే, తన ఇష్టాన్ని ఎంకరేజ్‌ చేసి ఉంటే, ఆమె నిజంగానే ఎయిర్‌ హోస్టెస్‌ అయ్యుండేది. ఆ రంగంలోనే సెటిల్‌ అయ్యేది. సినిమాల్లోకి వచ్చేది కాదు. మహేష్‌ బాబుని కలిసేది కాదు, ఆయన్ని పెళ్లి చేసుకునేది కాదు. టాలీవుడ్‌లో ఈ ప్రేమ కథకు బీజం పడేది కాదు.

55
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నమ్రత

మహేష్‌ బాబు, నమ్రత ప్రేమించుకుని 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు గౌతమ్ ఘట్టమనేని, కూతురు సితార జన్మించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది నమ్రత. మహేష్‌ బాబు ముందుగానే సినిమాల్లో నటించ వద్దని కండీషన్‌ పెట్టాడట. ఆ కండీషన్‌ కోసమే తాను సినిమాలు మానేసినట్టు తెలిపింది నమ్రత. అంతేకాదు మున్ముందు కూడా తాను నటించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories