`దేవర`, `పుష్ప2` వాయిదా..? కొత్త డేట్లు.. టిల్లుగాడు వచ్చేది కూడా అప్పుడే? మొత్తం గందరగోళం..

Published : Jan 23, 2024, 07:42 PM IST

టాలీవుడ్‌లో మళ్లీ `రిలీజ్‌` గందరగోళం నెలకొంది. వరుసగా సినిమా వాయిదాలు అంతా మార్చేస్తున్నాయి. ఇప్పుడు గేమ్‌ అంతా మారిపోతుంది. `దేవర`, `పుష్ప2` వాయిదా వార్తలు హాట్‌ టాపిక్ అయ్యాయి.   

PREV
16
`దేవర`, `పుష్ప2` వాయిదా..? కొత్త డేట్లు.. టిల్లుగాడు వచ్చేది కూడా అప్పుడే? మొత్తం గందరగోళం..

సినిమాలు వాయిదా పడటం, వాటి స్థానంలో మరికొన్ని సినిమాలు రావడం తరచూ జరుగుతుంది. ఇటీవల ఆ గందరగోళం ఎక్కువైంది. భారీ సినిమా వాయిదా పడ్డప్పుడు, కొత్త డేట్‌ కి వచ్చినప్పుడు ఆ డేట్ లో ఉన్న సినిమాలు వెళ్లిపోవడం, ఖాళీ అయిన డేట్‌కి మరిన్ని సినిమాలు రావడం జరుగుతుంటుంది. గతేడాది `సలార్‌` విషయంలో అడే జరిగింది. అంతా చెల్లా చెదారు అయ్యాయి. ఇప్పుడు మరోసారి అలాంటి గందరగోళం నెలకొంటుంది. 

26

ఇప్పుడు `దేవర` వంతు వచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఈ మూవీ ఏప్రిల్‌ 5న విడుదల చేయబోతున్నట్టు ప్రారంభంలోనే ప్రకటించారు. అయితే ఇటీవల వాయిదా వార్తలు వచ్చిన నేపథ్యంలో టీమ్‌ ఖండించింది. అదే డేట్‌కి వస్తున్నట్టు తెలిపింది. కానీ ఇప్పుడు మరోసారి ఈ వార్తలు ఊపందుకున్నాయి. లోక్‌ సభ ఎన్నికలు, ఏపీ ఎన్నికలు ఏప్రిల్‌లో రాబోతున్నాయనే వార్తలు మొదలయ్యాయి. లోక్‌ సభ ఎన్నికలు ఏప్రిల్‌ 16 నుంచి ప్రారంభం కాబోతున్నట్టు ఓ సర్క్యూలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో ఏపీ ఎన్ని కూడా అదే సమయంలో ఉంటాయని అంతా భావిస్తున్నారు. దీంతో రిలీజ్‌ డేట్‌లో మార్పులకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. 
 

36

ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికలు ఏప్రిల్‌లో ఉంటే ఎన్టీఆర్ నటించిన `దేవర` మూవీ వాయిదా పడుతుందని భావించారు. టీమ్‌ నుంచి అలాంటి సందేశమే వచ్చింది. ఇప్పుడు అదే వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ మూవీ ఆగస్ట్ కి వాయిదా పడుతుందట. స్వాతంత్ర్య దినోత్సం కానుకగా రాబోతుందని అంటున్నారు. కొరటాల శివ రూపొందించిన ఈ మూవీ భారీ పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. అయితే వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా కొంత డిలే అవుతుందని తెలుస్తుంది. అటు ఎన్నికలు, ఇటు పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ ని దృష్టిలో పెట్టుకుని ఆగస్ట్ లో రావాలని భావిస్తున్నారట. 
 

46

ఇదిలా ఉంటే ఐకాన్‌ స్టార్‌ నటిస్తున్న `పుష్ప 2` కూడా మరోసారి వాయిదా పడుతుంది. ఈ మూవీ గతేడాదిలోనే వస్తుందని భావించారు. కానీ టీమ్‌ ఆగస్ట్ 15న రాబోతున్నట్టు ప్రకటించారు. కానీ ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్న తీరుని చూస్తుంటే ఇది ఆ సమయానికి పూర్తి కాదని తెలుస్తుంది. ఇంకా ఆలస్యం అవుతుందట. దీంతో ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్‌ చేస్తున్నారని తెలుస్తుంది. ఆగస్ట్ 15 నుంచి తప్పుకుంటుందని, దసరా, దీపావళి, లేదంటే డిసెంబర్‌లో రాబోతుందని తెలుస్తుంది. దీంతో ఆ ప్లేస్‌కి తారక్‌ రాబోతున్నారని అంటున్నారు. 
 

56

ఇదిలా ఉంటే `టిల్లు స్వ్కైర్‌` రిలీజ్‌ డేట్‌ కన్ఫమ్‌ చేసుకునే పనిలో టీమ్‌ ఉంది. ఫిబ్రవరి 9న రావాల్సిన మూవీని వాయిదా వేసుకుంటున్నట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. అయితే కొత్త డేట్‌ ఇవ్వలేదు. ఇప్పుడు ఏప్రిల్‌ 5 నుంచి `దేవర` వెళ్లిపోతున్న నేపథ్యంలో ఈ మూవీని ఏప్రిల్‌ మొదటి వారంలో అంటే, `దేవర` డేట్‌కి వేసుకోవాలనుకుంటున్నారట. మార్చి చివరి వారంలోగానీ, లేదంటే ఏప్రిల్‌ ఫస్ట్ వీక్‌లోగానీ దీన్ని రిలీజ్‌ చేసే ఛాన్స్ ఉందట. ఇదేకాదు ఇంకా చాలా సినిమాల రిలీజ్‌ డేట్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. 
 

66

 ఎన్టీఆర్‌ హీరోగా నటించిన `దేవర`కి కొరటాల శి దర్శకత్వం వహించగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. హాలీవుడ్‌ టెక్నిషిన్లు దీనికి పనిచేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప 2`లో రష్మిక హీరోయిన్‌. ఫహద్‌ ఫాజిల్‌ విలన్. ఇంకోవైపు సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న `టిల్లు స్వ్కైర్‌`కి మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సితార బ్యానర్‌పై తెరకెక్కుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories