విశ్వక్​సేన్ కామెంట్స్...మండిపడుతున్న నార్త్ జనం

First Published | Nov 19, 2024, 10:45 AM IST

ఎన్టీఆర్ నటనను పొగుడుతూ, హృతిక్ రోషన్‌ను తక్కువ చేసినట్లుగా విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హృతిక్ కంటే ఎన్టీఆర్ నటన 'వార్ 2'లో అద్భుతంగా ఉంటుందని, అభిమానులు చొక్కాలు చించుకోవడానికి సిద్ధంగా ఉండాలని విశ్వక్ సేన్ అన్నారు.

Vishwak Sen, Hrithik Roshan, ntr


ఎప్పుడూ ఏదో విధంగా వార్తల్లో నిలవటం యంగ్ హీరో విశ్వక్ సేన్ కు అలవాటే. ఆయన కామెంట్స్ చాలా సార్లు వివాదాస్పదమయ్యాయి. అదే సమయంలో తన సినిమాలపై దృష్టి పడేలా చేసాయి. ఇప్పుడు అదే విధంగా  హృతిక్ రోషన్ పై చేసిన కామెంట్స్ నార్త్ జనాలకు మండేలా చేస్తున్నాయి.

ఎన్టీఆర్ కు ఎలివేషన్ ఇస్తూ హృతిక్ రోషన్ ని చిన్నబుచ్చుతూ చేసిన ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే విశ్వక్సేన్ కు పెద్దగా నార్త్ మార్కెట్ లేకపోవటంతో అక్కడ స్పందన ఓ రకంగా తక్కువే ఉంది. అదే అక్కడ బాగా తెలిసిన నటుడు ఇలా మాట్లాడి ఉంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేది. ఇంతకీ విశ్వక్ ఏమన్నారో చూద్దాం. 

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ చాలా సందర్భాలలో అవకాశం ఉన్నప్పుడల్లా మీడియా ముందు చెప్పారు.  ప్రతిసారి విశ్వక్ సేన్ ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని మాటల్లో చూపిస్తూ వస్తున్నారు.

ఇండియాలోనే అందరికంటే ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అంటూ విశ్వక్ గతంలో చెప్పుకొచ్చారు. ‘దేవర’ మూవీ రిలీజ్ సమయంలో విశ్వక్ సేన్ ట్వీట్స్ చేసి ఎన్టీఆర్ ఎలివేషన్ పై ప్రశంసలు కురిపించారు.  ఇప్పుడు మరోసారి అదే పని చేసారు. అయితే మధ్యలో హృతిక్ రోషన్ ని తీసుకొచ్చారు. 
 



 ఎన్టీఆర్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'వార్ 2'గురించి   హీరో విశ్వక్​సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వార్​ 2 సినిమాలో ఎన్టీఆర్ నటన ఆద్భుతంగా ఉంటుందని విశ్వక్ అన్నారు. ఎన్టీఆర్ రీసెంట్ బ్లాక్​బస్టర్ 'దేవర' రీసెంట్​గా 50 రోజుల థియేటర్ రన్ పూర్తి చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ హైదరాబాద్​లో గ్రాండ్ సెలబ్రేషన్స్​ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరైన హీరో విశ్వక్ కొన్ని వివాదాస్పదమైన  కామెంట్స్ చేశారు.


'వార్​ 2' లో ఎన్టీఆర్​తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హృతిక్ కంటే ఎన్టీఆర్​ నటనే అద్భుతంగా ఉండనుందని ఆన్నారు. ఆయన నటనకు ఫ్యాన్స్ చొక్కాలు చించుకోడానికి రెడీగా ఉండాలంటూ హుషారెత్తించారు.

'ఎదురుగా ఉన్నది హృతిక్ రోషన్ అయినా సరిపోదు. అన్న బటన్ విప్పుతడు. మీరు బట్టలు చించుకోడానికి రెడీ అవ్వండి' అని అన్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా కేరింతలు కొట్టారు.
 


అయితే వార్ 2 షూటింగ్ జరుగుతోన్న ఈ సమయంలో హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ ని మ్యాచ్ చేయలేడంటూ విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీని పైన విశ్వక్ సేన్ ఏమైనా క్లారిటీ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ బెస్ట్ పెర్ఫార్మర్ అనే విషయం దాకా బాగానే ఉన్నా హృతిక్ రోషన్ ని చిన్నబుచ్చ కూడదు కదా అంటున్నారు నార్త్ జనం. అయితే ఎన్టీఆర్ గురించి చెప్పాలనే కానీ హృతిక్ గురించి బ్యాడ్ గా చెప్పాలని కాదు కదా విశ్వక్సేన్ ఆలోచన. అయితే వాళ్లకు అర్దమైనట్లు వాళ్లు అర్దం చేసుకుంటున్నారు. ఈ విధంగా మరోసారి విశ్వక్ వార్తల్లో నిలిచారు. 
 


వార్ 2 సినిమాను అయాన్‌ ముఖర్జీ పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ పలు షెడ్యూల్​లలో పాల్గొన్నారు. ఆయనపై పలు కీలక సన్నివేశల చిత్రీకరణ పూర్తయ్యిందని టాక్. మరోవైపు హృతిక్ కూడా రెగ్యులర్ షూటింగ్​లో పాల్గొంటున్నారట. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ కీలక పాత్రలో నటిస్తోంది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఈ ప్రాజెక్ట్​ను భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది.
 

Latest Videos

click me!