చిరు, పవన్ కూడా ఇదే చెప్పారు, మాట తప్పారు... మరి విజయ్?

First Published Feb 2, 2024, 5:19 PM IST


విజయ్ పొలిటికల్ ఎంట్రీ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తమిళనాడు రాజకీయాల్లో ఇది కీలక పరిణామం. ఈ సందర్భంగా విజయ్ ఇచ్చిన ఓ హామీ మెగా బ్రదర్స్ చిరు, పవన్ లను గుర్తు చేసింది. 
 

Vijay


నటుడు కావడం చాలా కష్టం. స్టార్ హీరో కావాలంటే పెట్టి పుట్టాలి. టాలెంట్ తో పాటు కాలం కూడా కలిసి రావాలి. నూటికో కోటికో ఒక్కడు స్టార్ అవుతాడు. అయితే సక్సెస్ఫుల్ లీడర్ కావాడం దానికంటే కష్టం. సీఎం పీఠమే లక్ష్యంగా చాలా మంది స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చారు. వారిలో సక్సెస్ అయ్యింది ముగ్గురే ముగ్గురు. 
 

Rajinikanth

తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత... ఏపీలో ఎన్టీఆర్ మాత్రమే రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. రజినీకాంత్ సీఎం కావచ్చని పలువురు భావించారు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో అనిశ్చితి ఏర్పడింది. అప్పుడు రజినీ ఎంట్రీ ఇచ్చి ఉంటే మూడో ప్రత్యామ్నాయం అయ్యేవారేమో.

Latest Videos



పూర్తిగా వయసు ఉడికిపోయాక, ఆరోగ్యం పాడకయ్యాక జెండా పాతడం సాధ్యం కాదని తెలుసుకుని రాజకీయాలకు రజినీ గుడ్ బై చెప్పేశాడు. కమల్ హాసన్ పార్టీ పెట్టినా...  కనీస ఆదరణ దక్కలేదు. రజినీకాంత్ లా తాను కాకూడదని విజయ్ ఫార్మ్ ఉండగానే గట్టి నిర్ణయం తీసుకున్నాడు. నేడు అధికారికంగా పొలిటికల్ ఎంట్రీ ప్రకటించారు. 

విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం(TVK). ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాల పూర్తి చేసి నటనకు గుడ్ బై చెప్పేస్తాను. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయను. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అని చెప్పారు. అభిమానులకు విజయ్ ప్రకటన కొంచెం కష్టం కొంచెం ఇష్టం అన్నట్లుగా ఉంది. 

Chiranjeevi

విజయ్ ప్రకటన నేపథ్యంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి... అప్ కోర్స్, ఒకసారి సినిమా కాదని ప్రజాక్షేత్రంలోకి వచ్చాక మరలా నటించడమా? జరగదు, అని గట్టిగా చెప్పాడు. తీరా చూస్తే పీఆర్పీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి 2017లో ఖైదీ 150తో రీ ఎంట్రీ ఇచ్చాడు. హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు.

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కూడా ఇదే చేశారు. జనసేన అధినేతగా  2018లో సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ జీవితం ఇక ప్రజాసేవకే అంకితం. సినిమాలు చేయను అన్నారు. ఏడాది తిరగక ముందే నిర్ణయం మారిపోయింది. 2019 చివర్లో వరుసగా రెండు మూడు చిత్రాలు ప్రకటించారు. 
 

Vijay


పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల వలె విజయ్... ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసి పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవుతాను అన్నారు. 

 

మాట ఇవ్వడం తేలిక. దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. సినిమాకు వంద కోట్లు తీసుకునే విజయ్ పాలిటిక్స్ లో సక్సెస్ కాకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడా లేక ఒట్టు గట్టు మీద పెట్టి ముఖానికి రంగు వేసుకుంటాడా అనేది చూడాలి... 

click me!