అది తెలిశాక విజయ్ దేవరకొండ మీద పగ పెంచుకున్నాను... అనసూయ షాకింగ్ కామెంట్స్

Published : Jun 10, 2023, 08:42 PM IST

విజయ్ దేవరకొండ-అనసూయ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదం ఇంతటితో ఆపేస్తున్నట్లు అనసూయ అన్నారు. దీనిపై ఆమె మరోసారి వివరణ ఇచ్చారు.   

PREV
15
అది తెలిశాక విజయ్ దేవరకొండ మీద పగ పెంచుకున్నాను... అనసూయ షాకింగ్ కామెంట్స్

తనపై విజయ్ దేవరకొండ వద్ద పని చేసే ఓ వ్యక్తి డబ్బులిచ్చి దుష్ప్రచారం చేయించాడని అనసూయ ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు. విజయ్ కి తెలియకుండా ఆ వ్యక్తి నన్ను టార్గెట్ చేస్తాడని నేను అనుకోను. ఆ విషయం తెలిశాక నేను చాలా బాధపడ్డానని అనసూయ అన్నారు. 
 

25


ఒకప్పుడు నేను, విజయ్ దేవరకొండ మిత్రులం. ఆయన నిర్మించిన మీకు మాత్రమే చెప్తా మూవీలో నాకు రోల్ ఆఫర్ చేశారు. విజయ్ దేవరకొండకు నాపై ద్వేషం ఉందో లేదో నాకు తెలియదు. ఇకపై ఈ వివాదాన్ని పొడిగించకూడదు అనుకుంటున్నాను. ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నానని అనసూయ అన్నారు. 
 

35

విమానం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న అనసూయను ఈ విషయం పై మరోసారి వివరణ కోరడం జరిగింది. విజయ్ దేవరకొండతో వివాదం ఇకపై వద్దు అని నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటని అడగ్గా... మనశ్శాంతి  కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎవరి మీదనైనా కామెంట్స్ చేయగలరు. ఒకరు డబ్బులిచ్చి నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారని తెలిశాక నా గుండె బద్దలైందని అనసూయ అన్నారు.  
 

45

ఈ పరిణామం విజయ్ దేవరకొండ మీద పగ పెంచుకునేలా చేసింది. అవకాశం దొరికినప్పుడల్లా స్పందించాలని అనుకోకుండా ఒక ఆలోచన నాలో డెవలప్ అయ్యింది. నేను ఒక తల్లిని, అమ్మాయిని నన్ను టార్గెట్ చేశారు. ఎవరైనా మెప్పు కోసమే బ్రతుకుతారు. ఇక ఈ వివాదం వద్దనుకుంటుంది మనశ్శాంతి కోసమే అని ఆమె చెప్పుకొచ్చారు.

 

55
Anasuya Bharadwaj

మీరు ఫోన్ చేసి విజయ్ దేవరకొండతో మాట్లాడితే పోయేది కదా... అని అడగ్గా, నేను ట్రై చేశాను. కుదర్లేదు. నాకు మిగతా వాళ్ళ మాదిరి పీఆర్స్ లేరు. నా గురించి నేనే మాట్లాడుకుంటాను. నన్ను నేనే రిప్రజెంట్ చేసుకుంటాను, అన్నారు. అనసూయ మాటలను పరిశీలిస్తే తనపై డబ్బులిచ్చి ట్రోలింగ్ చేయించినందుకు అలా ట్వీట్స్ వేశానని చెప్పినట్లు ఉంది. 
 

click me!

Recommended Stories