హీరోయిన్ అదితిరావ్ హైదరి, హీరో సిద్దార్థ్ రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనిపై సిద్దార్థ్ క్లారిటీ ఇచ్చారు. నిజమే అని ఆయన ఒప్పుకున్నట్లు అయ్యింది.
హీరోయిన్ అదితిరావ్ హైదరితో సిద్దార్థ్ రిలేషన్ లో ఉన్నాడని కొద్దిరోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఈ ప్రేమ జంట కెమెరా కంటికి పలుమార్లు చిక్కారు. దీంతో... ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారని జనాలు కన్ఫర్మ్ చేసేశారు. ఈ పుకార్లను బలపరిచేదిగా వారి ప్రవర్తన ఉంది.
26
తాజాగా సిద్ధార్థ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆయన స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఓ డాన్స్ షోకి అతిథిగా హాజరయ్యారు. యాంకర్ శ్రీముఖి ఒక ప్రశ్న అడిగారు. మీరు జీవితాంతం కలిసి డాన్స్ చేయాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని అడగ్గా... 'మా ఊళ్ళో అతిథిదేవోభవ అంటారు' అని సిద్ధార్థ్ సమాధానం చెప్పారు.
36
Aditi Rao Hydari And Siddharth
అతిథిదేవోభవలో అతిధి అనే పేరుంది. కాబట్టి ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారు. అతిధిరావు హైదరిని ఆయన లైఫ్ టైం డాన్స్ పార్టనర్ గా ఉండాలనుకుంటున్నాడు. అంటే దాని అర్థం, ఆమెతో ఆయన సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారని పలువురి వాదన. సిద్ధార్థ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
46
Aditi Rao Hydari And Siddharth
కాగా సిద్ధార్థ్, అదితిరావ్ హైదరిలకు వేరే వ్యక్తులతో పెళ్ళిళ్ళై విడాకులు అయ్యాయి. సిద్ధార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చారు. అప్పటి నుండి మళ్ళీ పెళ్లి మాట ఎత్తలేదు.
56
Aditi Rao Hydari
అదితి చాలా చిన్న వయసులో సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకున్నారు. అనంతరం అతనితో అదితి విడిపోవడం జరిగింది. ఇక వీరి కెరీర్స్ పరిశీలిస్తే ఏమంత ఆశాజనకంగా లేవు. సిద్దార్థ్ హిట్ మూవీలో నటించి ఏళ్ళు దాటిపోతుంది.తెలుగులో అదితి చివరి చిత్రం మహాసముద్రం. ఈ మూవీలో సిద్ధార్థ్ సెకండ్ హీరో రోల్ చేశాడు.
66
సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ టక్కర్ జూన్ 9న విడుదలైంది. ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు. వివాదాలతో ఆగిపోయిన ఈ చిత్రం తిరిగి సెట్స్ పైకి వెళ్ళింది. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఆయన హీరోగా రెండు తమిళ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.