పవన్ కళ్యాణ్ కి అనసూయ ఝలక్... ఆయన అడిగితే చెప్పానంటూ యూటర్న్ తీసుకున్న స్టార్ యాంకర్!

Published : Mar 29, 2024, 09:08 AM IST

పవన్ కళ్యాణ్ విషయంలో అనసూయ మాట మార్చింది. నేను అలా అనలేదు అంటూ జన సైనికులకు ఝలక్ ఇచ్చింది. అనసూయ తీరు చర్చకు దారి తీసింది.   

PREV
17
పవన్ కళ్యాణ్ కి అనసూయ ఝలక్... ఆయన అడిగితే చెప్పానంటూ యూటర్న్ తీసుకున్న స్టార్ యాంకర్!
Anasuya Bharadwaj

అనసూయ భరద్వాజ్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆమె మాట తీరు, ప్రవర్తన పలుమార్లు వివాదాస్పదం అయ్యింది. హీరో విజయ్ దేవరకొండను అయితే స్వయంగా గెలికి మరీ వివాదం రాజేసింది. కావాలనే విజయ్ దేవరకొండను టార్గెట్ చేశానని ఆమె స్వయంగా చెప్పడం విశేషం. 

27
Anasuya Bharadwaj

విజయ్ దేవరకొండ వద్ద పని చేసే వ్యక్తి ఒకరు తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నాడని తెలిసింది. విజయ్ దేవరకొండకు తెలియకుండా ఇది జరగదు కదా. అందుకే విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టినట్లు ఆమె ఒప్పుకున్నారు. అయితే ఇకపై వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. 

 

37
Anasuya Bharadwaj

తాజాగా అనసూయ కొన్ని పొలిటికల్ కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్. ఆయన కోరితే జనసేన తరపున ప్రచారం చేస్తాను, అన్నారు. అనసూయ కామెంట్స్ జన సైనికుల్లో జోష్ నింపాయి. ఆమెను పొగుడుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో వరుస పోస్ట్స్ పెడుతున్నారు. 

47


అయితే వాళ్ళ ఆశలపై అనసూయ నీళ్లు చల్లింది. నేను అలా అనలేదని ఫ్లేటు మార్చింది. ఓ ప్రైవేట్ ఈవెంట్ కి హాజరైన అనసూయను... మీరు జనసేన పార్టీలో చేరుతున్నారా? పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తాను అన్నారు కదా? అని అడగడం జరిగింది. 

57

యాంకర్ అడిగితే నేను ఆ మాట అన్నాను. నాకు నేనుగా జనసేన తరపున ప్రచారం చేస్తానని అనలేదు. నేను తుమ్మినా దగ్గినా మీకు కాంట్రవర్సీ కావాలి. నాకు జనసేన అజెండా అంటే ఇష్టం. అయితే నేను ప్రచారం చేయను. పలు రాజకీయ పార్టీల అజెండాల మీద నాకు రెస్పెక్ట్ ఉంది. మనం సమాజంలో ఉంటున్నాము. అందరూ బాగుండాలి.. అని అనసూయ అన్నారు. 

67
Anasuya bharadwaj

పరోక్షంగా యాంకర్ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను కానీ... నాకు జనసేన తరపున ప్రచారం చేసే ఉద్దేశం లేదని చెప్పకనే చెప్పింది. అనసూయ తీరుకు జనసేన నాయకులు అవాక్కు అయ్యారు. ఇలా యూటర్న్ తీసుకుంది ఏమిటని వాళ్ళు వాపోతున్నారు. 

 

77

ఆ విషయం పక్కన పెడితే అనసూయ నటిగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆమెకు రాజకీయ ప్రచారాల్లో పాల్గొనే తీరిక లేదు. ఇటీవల ఆమె నటించిన రజాకార్ విడుదలైంది. పుష్ప 2తో పాటు పలు ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. అనసూయ కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది... 

Read more Photos on
click me!

Recommended Stories