Published : Mar 29, 2024, 06:28 AM ISTUpdated : Mar 29, 2024, 06:30 AM IST
సిద్దు జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రం టిల్లు స్క్వేర్. ట్రైలర్, టీజర్స్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. టిల్లు స్క్వేర్ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో టాక్ ఏమిటో చూద్దాం..
2022లో వచ్చిన డీజే టిల్లు భారీ విజయం అందుకుంది. ఈ చిత్ర బడ్జెట్ రీత్యా అత్యధిక లాభాలు పంచింది. సిద్దు జొన్నలగడ్డ-నేహా శెట్టి జంటగా నటించగా విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. డీజే టిల్లు మూవీలో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. కుర్రకాళ్లకు సిద్దు పాత్ర తెగ నచ్చేసింది. నాన్ స్టాప్ నవ్వులతో డీజే టిల్లు సాగుతుంది.
27
Tillu Square Movie Review
ఈ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ప్లాన్ చేశారు. విమల్ కృష్ణ స్థానంలో దర్శకుడిగా మాలిక్ రామ్ ని తెచ్చారు. నిర్మాత నాగ వంశీ సీక్వెల్ ని కూడా నిర్మించారు. సిద్దు జొన్నలగడ్డకు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. మార్చి 29న వరల్డ్ వైడ్ విడుదల చేశారు.
37
Tillu Square Movie Review
టిల్లు స్క్వేర్ మూవీ పై యూత్ లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. డీజే టిల్లు సక్సెస్ కావడంతో పాటు టిల్లు స్క్వేర్ ప్రోమోలు ఆకట్టుకున్నాయి. హోమ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ముద్దు సన్నివేశాల్లో నటించడం ఒకింత షాక్ కి గురి చేసింది.అనుపమ ఆ తరహా రోల్ చేయడం చర్చకు దారి తీసింది.
47
Tillu Square Movie Review
మరి టిల్లు స్క్వేర్ అంచనాలు అందుకుందా? డీజే టిల్లు మాదిరి సీక్వెల్ లో కూడా విషయం ఉందా? అంటే... ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని అంటున్నారు. సిద్దు ఎప్పటిలాగే తన ఎనర్జీ తో ఆకట్టుకున్నాడు. ఆయన యాటిట్యూడ్, క్యారెక్టరైజేషన్ నవ్వులు పూయిస్తాయి. సిద్ధూ మరోసారి ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
57
Tillu Square Movie Review
వన్ లైనర్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయని అంటున్నారు. కొన్ని కామెడీ ఎపిసోడ్స్ సైతం మెప్పించాయి. అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచేలా ఉందని అంటున్నారు. కొందరు ఫస్ట్ హాఫ్ యావరేజ్ అంటుంటే మరికొందరు ఆడియన్స్ చాలా బాగుంది. సూపర్ హిట్ అంటున్నారు.
67
అయితే అనుపమ పరమేశ్వరన్ గురించి ఎవరూ ప్రస్తావించడం లేదు. ఆమె పాత్ర టిల్లు స్క్వేర్ లో పెద్దగా ప్రభావం చూపలేదేమో అనే భావన కలుగుతుంది. పార్ట్ 1 లో నేహా శెట్టి రోల్ ప్రేక్షకులను గట్టిగా తాకింది. రాధిక అంటే నేహా శెట్టి గుర్తుకు వచ్చేలా ఆమె క్యారెక్టర్ ఉంటుంది.
77
సెకండ్ హాఫ్ లో సైతం నాన్ స్టాప్ నవ్వులు. టిల్లు స్క్వేర్ తో పోల్చుకుంటే డీజే టిల్లు జస్ట్ షార్ట్ ఫిల్మ్ లాంటిది మాత్రమే. పార్ట్ 1 కంటే పార్ట్ 1 చాలా బాగుంది అనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు. బీజీఎం, సాంగ్స్ కి పాజిటివ్ మార్క్స్ పడుతున్నాయి. మొత్తంగా చూస్తే టిల్లు స్క్వేర్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. సినిమా ఎలా ఉంది అనేది పూర్తి రివ్యూ వస్తే కానీ చెప్పలేం..