ఓ నెటిజన్ Raashi khanna మీకు ఇష్టమైన ఆహారం ఏమిటని అడిగారు... దీనికి సమాధానంగా నేను తినడాన్ని అంతగా ఇష్టపడను. అదే సమయంలో నేను ప్యూర్ వెజిటేరియన్, మాంసాహారం జోలికి అస్సలు వెళ్లను. ఈ విషయం నా గురించి బాగా తెలిసిన వాళ్లకు మాత్రమే తెలుసు. ఇక, ఇష్టమైన ఆహారమంటే.. థాయ్ గ్రీన్ కర్రీ, ఛోలే బటురే, సమోసా. వీటిని ఎక్కువగా ఇష్టపడతాను అన్నారు.
రాశి ఖన్నా మొబైల్ లో వాల్ పిక్ గా తన గురువు గారితో దిగిన ఫోటో ఉంటుందట. అయితే తన గురువుగారు ఎవరు, అనే విషయాన్ని రాశి ఖన్నా వెల్లడించలేదు. ఇక తనకు అత్యంత ఇష్టమైన చిత్రం ది ప్రపోజల్ అని, రాశి ఖన్నా వెల్లడించారు.
కోలీవుడ్ లో విజయ్, నయనతార తనకు ఇష్టమైన స్టార్స్ అన్నారు రాశి ఖన్నా, తెలుగులో మాత్రం ఆ లిస్ట్ పెద్దగానే ఉంది. మహేష్, ఎన్టీఆర్, అనుష్క శెట్టి, సమంత, బన్నీ, వెంకటేష్ వంటి స్టార్స్ పేర్లు చెప్పారు. ముఖ్యంగా వెంకటేష్ గారంటే చాల ఇష్టమని, ఆయన చాలా బాగా మాట్లాడతారని, కలిసిపోతారని రాశి తన అభిమానం చాటుకున్నారు.
ఇక అల్లు అర్జున్ గురించి అడిగితే రాశి... ఆయనను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. ఆయన మంచి నటుడే కాకుండా.. మంచి డాన్సర్, ఆయనతో కలిసి నటించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నా అన్నారు రాశి. కాగా తన మాతృ భాష హిందీ అని, తనకు మొత్తం ఐదు భాషలు వచ్చని, ఆమె తెలియజేశారు.
బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే రాశి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంకా నా జీవితంలోకి బాయ్‌ఫ్రెండ్ రాలేదు. ఒకవేళ నేను ఎవరినైనా ఇష్టపడితే తప్పకుండా మీ అందరికీ చెబుతాను. కాబట్టి నా బాయ్ ఫ్రెండ్ ఎవరో ఇప్పుడే చెప్పలేనని రాశి ఓపెన్ అయ్యారు. గతంలో సాయి ధరమ్ తేజ్ తో రాశి ఖన్నా లవ్ లో ఉన్నట్లు వార్తలు రావడం జరిగింది. ఇక 16ఏళ్ల వయసులో అదే వయసున్న అబ్బాయితో డేట్ కి వెళ్లానని, అతడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని రాశి ఖన్నా చెప్పడం విశేషం.