చిరంజీవి చాలా మంది హీరోయిన్లతో పనిచేశారు. అందులో శ్రీదేవి నుంచి విజయశాంతి, రాధ, సుహాసిని, సుమలత, రమ్యకృష్ణ, రోజా, సౌందర్య, మీన, టబు వంటివారితోపాటు నిన్నటితరం, కాజల్, త్రిష, తమన్నా, నయనతార వంటి నేటి తరం హీరోయిన్లతోనూ పనిచేశారు. ఆయనతో సినిమా అంటే హీరోయిన్లకి చుక్కలే. ఎందుకంటే ఆయనతో పోటీగా డాన్స్ చేయడం హీరోయిన్లకి కష్టంగానే ఉంటుంది.