నా ఫ్యామిలీ విషయంలో నేను సింహాన్ని, కానీ నాన్న వల్లే ఇంత ప్రేమ, నాగార్జున సంచలన పోస్ట్

First Published | Oct 5, 2024, 12:01 AM IST

నాగార్జున ఫ్యామిలీకి,సమంత కోసం ఇండస్ట్రీ మొత్తం అండగా నిలుస్తుంది. దీంతో తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. అది సంచలనంగా మారింది. 
 

మంత్రి కొండా సురేఖ కామెంట్లు రాష్ట్రంలో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో ఆమె చేసిన ఆరోపణలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. రాష్ట్ర రాజకీయాలను షేక్‌ చేశాయి. నాగార్జున ఫ్యామిలీపై, సమంతపై ఆమె చేసిన వ్యాఖ్యలను తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం వారికి సపోర్ట్ గా నిలిచింది. సమంతపై చేసిన వ్యాఖ్యలను వాళ్లు తీవ్రంగా ఖండించారు.

బిగ్‌ బాస్‌ తెలుగు అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

ఇండస్ట్రీ మొత్తం ఇలా ఒక్కతాటిపైకి రావడం ఇటీవల కాలంలో జరగలేదు. దీంతో ఇదొక పెద్ద చర్చనీయాంశంగా మారంది. అంతేకాదు రాజకీయాలను సైతం షేక్‌ చేస్తుంది. సెలబ్రిటీల స్పందన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. ఈజీగా జనాల్లోకి వెళ్తుంటుంది. అది జనంలోనూ ప్రభావం చూపిస్తుంది. అన్ని వర్గాల నుంచి కూడా నాగ్ ఫ్యామిలీకి, సమంతకి మద్దతు లభిస్తుంది. 

అందుకే ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ సైతం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తాను నోరు జారినట్టు తెలిపారు. కానీ ఆ తర్వాత తాను సమర్థించుకోవడం మరింత రచ్చ అవుతుంది. ఈ విషయంలో ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ కావడం చాలా ఇంపాక్ట్‌ చూపించింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నాగార్జున స్పందించారు. తనకు మద్దతుగా స్పందన లభించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు నాగ్‌ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు. తనని తాను సింహంగా అభివర్ణించుకున్నారు నాగార్జున. అదే సమయంలో ఇంతటి స్పందనకి, ప్రేమకి నాన్న ఏఎన్నారే కారణంటూ వెల్లడించారు. 


నాగార్జున పోస్ట్ ని చూస్తే, నేను ఎల్లప్పుడు బలమైన వ్యక్తిని అని అనుకుంటాను. నా ఫ్యామిలీని కాపాడుకునే విషయానికి వస్తే నేను సింహాన్ని. అదృష్టవశాత్తూ మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ మాకు అండగా నిలబడేందుకు ముందకు వచ్చింది. ఇది మా నాన్నగారి ఆదరాభిమానాలు, ఆశీర్వాదం అని నేను భావిస్తున్నా` అని నాగార్జున తెలిపారు. కొండా సురేఖ తమపై చేసిన ఆరోపణల విషయంలో చిత్ర పరిశ్రమ మొత్తం స్పందించి ఖండించిన నేపథ్యంలో తనకు దక్కిన ఈ సపోర్ట్ పట్ల నాగార్జున ఈ ఆనందం వ్యక్తం చేస్తూ సంచలన పోస్ట్ పెట్టారు. ఇది వైరల్‌గా మారింది. అంతేకాదు ఇది నాగార్జున మార్క్ మాస్‌ రియాక్షన్‌ని తెలియజేస్తుంది. అదే సమయంలో ఎవరికీ బయడపడేది లేదని, సింహంలా గర్జిస్థాననే సాంకేతాలను కూడా నాగ్‌ ఈ సందర్బంగా ఇచ్చాడు.

KTR, Samantha, Naga Chaitanya, Konda Surekha,

అయితే అసలు ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయ్యింది. కొండా సురేఖ ఏమని చెప్పిందనేది చూస్తే, మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌ని టార్గెట్‌ చేసింది మంత్రి కొండా సురేఖ. ఆయన కారణంగానే సమంత, నాగాచైతన్య విడాకులు తీసుకున్నారు. ఎన్‌ కన్వెన్షన్‌ పైకి కేటీఆర్‌ వెళితే నాగార్జున ఆపాలని రిక్వెస్ట్ చేశాడు. అపాలంటే సమంతని పంపించమని డిమాండ్‌ చేశాడు. దీంతో సమంతని పంపించేందుకు నాగార్జున ఫ్యామిలీ నిర్ణయించింది. కానీ సమంత వెళ్లలేదని, నువ్వు వెళితే వెళ్లు లేదంటే ఫ్యామిలీ నుంచి వెళ్లిపో అని విడాకులు ఇచ్చారు. సమంత విడాకులకు కేటీఆరే కారణం అంటూ సంచలన ఆరోపణలు చేసింది సురేఖ. 

ఈ క్రమంలో రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు స్పందించారు. వారిని ఉద్దేశించిన నాగార్జున పోస్ట్ పెట్టడం విశేషం, తమని ఇంత భారీ స్థాయిలో మద్దతు లభించడం పట్ల తన హ్యాపీనెస్‌ని షేర్‌ చేసుకున్నారు. ఇదిలా ఉంటే కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశాడు నాగార్జున. అటు కేటీఆర్‌ సైతం పరువు నష్టం దావా పంపించారు. కొండా సురేఖపై నాగ్‌ వంద కోట్ల పరువు నష్టం దావా వేయడం గమనార్హం. మొత్తంగా నాగార్జున ఫ్యామిలీ, సమంత, చైతూ విడాకులు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పాను. 

Latest Videos

click me!